News January 27, 2025

BHPL: కొత్త వెంటిలేటర్లను ప్రారంభించిన MLA, కలెక్టర్

image

భూపాలపల్లి జిల్లా ఆసుపత్రిలో ఆరోగ్య సేవలను మెరుగు పరిచే దిశగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ ఆర్) నిధులతో అందించిన కొత్త వెంటిలేటర్లను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సోమవారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ఈ వెంటిలేటర్ల ప్రారంభం ద్వారా అత్యవసర వైద్య సేవలు మరింతగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

Similar News

News September 14, 2025

ఖమ్మం జిల్లాలో దడ పుట్టిస్తోన్న డెంగీ..!

image

ఖమ్మం జిల్లాలో కొద్దిరోజులుగా డెంగీ దడ పుట్టిస్తోంది. రోజురోజుకూ జ్వర బాధితుల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలోని వివిధ మండలాల్లో ఇప్పటి వరకు 171 కేసులు నమోదయ్యాయి. 111డెంగీ ప్రభావిత గ్రామాలుగా గుర్తించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ సమావేశాల్లో ఆదేశిస్తున్నా క్షేత్రస్థాయిలో అమలవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే అదునుగా ప్రైవేటు ఆసుపత్రుల నిర్వహకులు దండుకుంటున్నారు.

News September 14, 2025

SBIలో 122 పోస్టులు

image

<>ఎస్బీఐ<<>> 122 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్‌లు విడుదల చేసింది. ఇందులో మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులు 59, మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్) 63 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు OCT 2వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.750, SC, ST, దివ్యాంగులకు ఫీజు లేదు. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sbi.bank.in/

News September 14, 2025

బెల్లంపల్లి: ‘సారీ మమ్మీ, డాడీ నేను బతకలేను’

image

బెల్లంపల్లి మండలం ఆకెనపల్లికి చెందిన 9వ తరగతి విద్యార్థిని శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఎస్సై రామకృష్ణ ప్రకారం.. సుప్రియ(14)ను తల్లిదండ్రులు రోజు పాఠశాలకు వెళ్లాలని శుక్రవారం మందలించారు. మనస్తాపానికి గురై శనివారం తెల్లవారుజామున ఎలుకల గుళికలను మింగింది. ‘నాకు చదువుకోవాలని లేదు.. సారీ మమ్మీ, డాడీ నేను బతకలేను’ అంటూ వాంతులు చేసుకుంది. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది.