News January 28, 2025
BHPL: కొత్త వెంటిలేటర్లను ప్రారంభించిన MLA, కలెక్టర్

భూపాలపల్లి జిల్లా ఆసుపత్రిలో ఆరోగ్య సేవలను మెరుగు పరిచే దిశగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ ఆర్) నిధులతో అందించిన కొత్త వెంటిలేటర్లను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సోమవారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ఈ వెంటిలేటర్ల ప్రారంభం ద్వారా అత్యవసర వైద్య సేవలు మరింతగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
Similar News
News December 12, 2025
అక్కడ ‘జాగృతి’ బోణీ.. ఇక్కడ 95 ఏళ్ల వయసులో సర్పంచ్!

TG: పంచాయతీ ఎన్నికల్లో కవిత నేతృత్వంలోని ‘తెలంగాణ జాగృతి’ బోణీ కొట్టింది. NZB(D) వీరన్నగుట్ట తండా, తాడ్‌బిలోలి పంచాయతీల్లో జాగృతి బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. అటు KCR దత్తత గ్రామం యాదాద్రి(D) వాసాలమర్రిలో ఓట్లు సమానంగా రావడంతో టాస్ వేయగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలిచారు. మరోవైపు SRPT(D) నాగారం సర్పంచ్‌గా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి (వయసు 95 ఏళ్లు) ఎన్నికయ్యారు.
News December 12, 2025
పందుల నుంచి పంటను కాపాడే ద్రావణం!

కొందరు రైతులు పందుల బారి నుంచి తమ పంటను రక్షించుకోవడానికి కుళ్లిన కోడిగుడ్లను నీటిలో కలిపి పంట చుట్టూ చల్లుతున్నారు. ఈ ద్రావణం నుంచి వచ్చే సల్ఫర్ వాసన పందులకు చాలా అసహ్యంగా అనిపించడంతో పాటు పంట సహజ వాసనను వాటికి రానివ్వదు. దీంతో పందులు ఆ ప్రాంతానికి రావడానికి ఇష్టపడవని నిపుణులు చెబుతున్నారు. అయితే వర్షం పడినా లేదా వారం తర్వాత వాసన తగ్గిపోతే ఈ ద్రావణాన్ని పొలం చుట్టూ మళ్లీ చల్లాల్సి ఉంటుంది.
News December 12, 2025
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోం మంత్రి

చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని హోం మంత్రి అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. బస్సు ప్రమాద ఘటనా స్థలానికి హోం మంత్రి హుటాహుటిన బయలుదేరారు. మరికాసేపట్లో హోం మంత్రి మారేడుమిల్లికి చేరుకోనున్నారు.


