News January 28, 2025

BHPL: కొత్త వెంటిలేటర్లను ప్రారంభించిన MLA, కలెక్టర్

image

భూపాలపల్లి జిల్లా ఆసుపత్రిలో ఆరోగ్య సేవలను మెరుగు పరిచే దిశగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ ఆర్) నిధులతో అందించిన కొత్త వెంటిలేటర్లను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సోమవారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ఈ వెంటిలేటర్ల ప్రారంభం ద్వారా అత్యవసర వైద్య సేవలు మరింతగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

Similar News

News February 19, 2025

మెగా జాబ్ మేళా గోడపత్రికను ఆవిష్కరించిన కలెక్టర్

image

ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం మెగా జాబ్ మేళాకు సంబంధించిన ప్రచార గోడపత్రికలను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆవిష్కరించారు. ఈ నెల 22వ తేదీన కంభం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా జాబ్ మేళాను ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా, ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత జాబ్ మేళాను వినియోగించుకోవాలని తెలిపారు.

News February 19, 2025

కామారెడ్డి: పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి:విద్యాశాఖ కమిషనర్ 

image

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్ ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ కృష్ణ ఆదిత్య చెప్పారు. బుధవారం కామారెడ్డి జిల్లా ఇంటర్ విద్యాశాఖ కార్యాలయానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి షేక్ సలాం ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News February 19, 2025

ఢిల్లీ సీఎం ఎంపికపై ఉత్కంఠ

image

ఢిల్లీ కొత్త సీఎం ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు, కేంద్ర పరిశీలకులు భేటీ అయ్యారు. కాసేపట్లో ఢిల్లీ బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. కొత్త సీఎం రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

error: Content is protected !!