News March 30, 2025
BHPL: కొత్త సంవత్సరం.. స్థానిక సమరం!

స్థానిక సంస్థల ఎన్నికల ఆశావహులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రాజకీయ భవిష్యత్‌ను తేల్చనుంది. భూపాలపల్లి జిల్లాలో త్వరలో జరిగే సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఈ నూతన సంవత్సరంలో జరగనున్నాయి. వీటితో పాటు ఈ ఏడాది భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన రాజకీయ ఆశావహులకు ఈ ఏడాది ‘కీ’ రోల్ కాబోతోంది.
Similar News
News April 4, 2025
రైల్వే స్టేషన్లో వ్యర్థాలకు నిప్పు.. వందే భారత్‌కు తప్పిన ముప్పు

తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో వ్యర్థాలకు గుర్తు తెలియని వ్యక్తులు గురువారం నిప్పు పెట్టారు. దీంతో పొగ కమ్ముకోవడంతో కొంతసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అదే సమయంలో అటువైపు వందే భారత్ రైలు రావడంతో సిబ్బంది అప్రమత్తమై కొంతసేపు రైలును ఆపేశారు. స్థానికులు మంటలను అదుపు చేయడంతో పెనుప్రమాదంతప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 4, 2025
రామచంద్రపురం: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రామచంద్రపురం బైపాస్ రోడ్లో గురువారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని పి.గన్నవరం మండలం గంటి పెదపూడికి చెందిన వీరి సాయి వెంకటకృష్ణ (20) మృతి చెందాడు. దాసరి శ్రీనుతో కలిసి బైక్‌పై కాకినాడ నుంచి స్వగ్రామం గంటి పెదపూడి వెళ్తుండగా వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో వెంకటకృష్ణ అక్కడికక్కడే చనిపోగా దాసరి శ్రీను గాయపడ్డాడు. క్షతగాత్రుడ్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News April 4, 2025
NZB: కూలీ పనికి వెళ్లి.. మృత్యు ఒడిలోకి

నవీపేట మండలం నాళేశ్వర్ గ్రామానికి చెందిన గంగాధర్ గురువారం గోదావరి నదిలో పడి మృతి చెందినట్లు ఎస్ఐ వినయ్ తెలిపారు. గోదావరి నదిలో పాడైపోయిన బోరు మోటారును తీయడానికి గంగాధర్ కూలీ పనికి వెళ్ళాడు. ప్రమాదవశాత్తు కాలు జారి నదిలో పడిపోయినట్లు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.