News March 31, 2025
BHPL: ‘కొలువుల ధీరుడు’కి 10వ ప్రభుత్వ ఉద్యోగం (UPDATE)

చిట్యాల మండలం గుంటూరుపల్లి గ్రామానికి చెందిన వెల్ది గోపికృష్ణ టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూపు-1 ఫలితాల్లో 493.5 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 70వ ర్యాంకర్గా నిలిచిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వంలో 07, రాష్ట్ర ప్రభుత్వంలో ఇది 3వ ప్రభుత్వ ఉద్యోగంగా సాధించాడు. ప్రస్తుతం గోపికృష్ణ ఖమ్మం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా ఇటీవల ఆర్డర్ కాపీ తీసుకొని తెలంగాణ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పొందుతున్నాడు.
Similar News
News April 3, 2025
ఈ రైళ్లు సికింద్రాబాద్ వెళ్లవు

సికింద్రాబాద్ స్టేషన్లో అభివృద్ధి పనులు దృష్ట్యా పలు రైళ్ల టెర్మినళ్లను మార్చారు. ఈ నెల 15 నుంచి సికింద్రాబాద్-విజయవాడ శాతవాహన ఎక్స్ప్రెస్ కాచిగూడ నుంచి, సిద్దిపేట-సికింద్రాబాద్ రైలు మల్కాజ్గిరి, సికింద్రాబాద్-మణుగూరు, SC-రేపల్లె, SC-సిల్చార్, SC-దర్బంగా, SC-యశ్వంత్పూర్ రైళ్లు చర్లపల్లి టెర్మినల్ నుంచి, SC-పుణే ఎక్స్ప్రెస్ HYD నుంచి ప్రయాణిస్తాయి. దీంతో ఇకపై ఈ రైళ్లు సికింద్రాబాద్ రావు.
News April 3, 2025
‘భవిష్యత్తు తరాల మనుగడకు సుస్థిరమైన పర్యావరణ పరిరక్షణ’

సుస్థిరమైన పర్యావరణ పరిరక్షణ భవిష్యత్తు తరాల మనుగడకు ఎంతో అవసరమని ప్రముఖ పర్యావరణ వేత్త రిటైర్డ్ ప్రొఫెసర్ కె.పురుషోత్తం అన్నారు. ప్రభుత్వ డిగ్రీ,పీ. జీ కళాశాలలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సైన్సెస్ రీసెర్చ్ (ICSSR) ఆర్థిక సహకారంతో ఐక్యూఏసీ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు.
News April 3, 2025
పల్నాడు జిల్లా TODAY TOP NEWS

☞ నరసరావుపేట: జిల్లా సమగ్ర అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ అమలు చేస్తామన్న కలెక్టర్, ☞ ముప్పాళ్ల: వైసీపీ సానుభూతిపరుడిపై దాడి, ☞ రాజుపాలెం: గంజాయి అక్రమ రవాణాలో అరెస్టులు, ☞ బొల్లాపల్లి: తల్లిని హతమార్చిన తనయుడు, ☞ మాచర్ల: ఆర్టీసీ కార్మికుల ఆందోళన, ☞ నకరికల్లు: రుణ మేళాలకు 432 దరఖాస్తులు, ☞ నూజెండ్ల: బెల్టు షాపులపై కేసులు నమోదు, ☞ పెదకూరపాడు: బూత్ లెవెల్ అధికారులకు శిక్షణ.