News October 16, 2024

BHPL: గుండెపోటుతో ఐదేళ్ల చిన్నారి మృతి

image

గుండెపోటుతో చిన్నారి మృతి చెందిన ఘటన BHPL జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబీకుల ప్రకారం.. టేకుమట్ల మండలంలోని పంగిడిపల్లి గ్రామానికి చెందిన రాజు, జమున దంపతులు కొడుకు, కూతురుతో కలిసి జమ్మికుంటలో ఉంటున్నారు. చిన్నారి పాఠశాలకు వెళ్లే క్రమంలో కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి HNK తీసుకెళ్లి చూపించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారన్నారు.

Similar News

News October 30, 2025

బాధితులకు అండగా ఉండండి: వరంగల్ కలెక్టర్

image

భారీ వర్షాల ప్రభావంతో జలదిగ్బంధంలో ఉన్న ఎన్‌ఎన్ నగర్ ప్రాంతాన్ని కలెక్టర్ డాక్టర్ సత్య శారదా స్వయంగా సందర్శించారు. వరద బాధితులను పరామర్శించి వారి సమస్యలను ఆరా తీశారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న అధికారులను మార్గనిర్దేశం చేస్తూ తక్షణ సహాయం అందించాలని సూచించారు. బాధితులకు అవసరమైన ఆహారం, నీరు, వైద్య సదుపాయాలు అందించాలంటూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

News October 29, 2025

కల్లెడ చెరువు కట్ట సురక్షితమేనా..?

image

తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షంలో అత్యధికంగా మండలంలోని కల్లెడలో ఉంది. వర్షంతో గ్రామంలో 36.7 సెం.మీ వర్షపాతం నమోదయింది. దీంతో గ్రామంలోని చెరువుకట్ట పరిస్థితి ఏంటని గ్రామస్థులు భయపడుతున్నారు. మూడేళ్ల క్రితం కురిసిన వర్షాలకు గ్రామంలోని చెరువు కట్టకు సమానంగా నీరు చేరడంతో బూర్గుమళ్ల వైపు కట్టని తొలగించి నీటిని తీసివేశారు. ప్రస్తుతం కట్ట పరిస్థితిపై గ్రామస్థులు భయపడుతున్నారు.

News October 29, 2025

WGL: జిల్లాలో 1,554 మి.మీల వర్షపాతం

image

తుఫాన్ కారణంగా వరంగల్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 1,554 మి.మీల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక జిల్లాలో అత్యధికంగా నెక్కొండ మండలంలో 192 మి.మీల, వర్ధన్నపేట-175, ఖిలా వరంగల్-161, పర్వతగిరి-148, సంగేమ్-146, రాయపర్తి-133, WGL-125, ఖానాపురం-119, గీసుగొండ 105 మి.మీ, మిగతా మండలాల్లో 100 లోపు నమోదైంది.