News April 2, 2025
BHPL: ఘోర ప్రమాదం.. 20 మందికి గాయాలు

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం వలస కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. స్థానికుల వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్కు చెందిన 20 మంది వలస కూలీలు వాహనంలో వెళ్తుండగా కమలాపూర్-రాంపూర్ గ్రామాల మధ్య వాహనం ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది వలసకూలీలకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు కూలీలను భూపాలపల్లిలోని 100 పడకల ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 14, 2025
పుట్టపర్తి కలెక్టరేట్లో గ్రీవెన్స్ తాత్కాలిక రద్దు

పుట్టపర్తిలోని కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)ను ఈ నెల 17న తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. సత్యసాయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించి ఫిర్యాదులు సమర్పించడానికి ప్రజలు కలెక్టరేట్కు రావద్దని కలెక్టర్ కోరారు.
News November 14, 2025
మళ్లీ తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర ఇవాళ ఒకేరోజు రెండు సార్లు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రేట్ ఉదయం రూ.770 తగ్గగా తాజాగా రూ.810 దిగివచ్చింది. దీంతో రూ.1,27,040కి చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర ఉదయం రూ.700 తగ్గగా ఇప్పుడు రూ.750 తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.1,16,450గా నమోదైంది. అటు వెండి ధర కేజీపై 100 తగ్గి రూ.1,83,100కు చేరింది.
News November 14, 2025
అనకాపల్లిలో బీజేపీ విజయోత్సవ సంబరాలు

బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన నేపథ్యంలో శుక్రవారం అనకాపల్లిలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. బాణసంచా కాల్చారు. స్వీట్లు పంపిణీ చేశారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరమేశ్వరరావు మాట్లాడుతూ.. మరోసారి విజయం అందించిన బిహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి నాగేశ్వరావు పాల్గొన్నారు.


