News March 30, 2025
BHPL: తెలుగు ప్రజల సంస్కృతిని ప్రతిబింబించే పండుగ: కలెక్టర్

భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఉగాది పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ… ఉగాది తెలుగు ప్రజల సంస్కృతిని ప్రతిబింబించే గొప్ప పండుగ అని అన్నారు. కొత్త ఆశలతో నూతన ఉత్సాహంతో నిండిన విశేషమైన రోజని పేర్కొన్నారు. జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో, శాంతి సౌభాగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ అభివృద్ధి సాధించాలని అన్నారు.
Similar News
News November 30, 2025
సీఎం రేవంత్ పర్యటనను నిలిపివేయాలి: కవిత

TG: పంచాయతీ ఎన్నికల వేళ CM రేవంత్ జిల్లాల పర్యటనకు సిద్ధమవ్వడంపై MLC కవిత అభ్యంతరం తెలిపారు. ‘ప్రభుత్వ సొమ్ముతో ప్రచారమా? ఎన్నికలు గ్రామాల్లో ఉంటే CM జిల్లా కేంద్రాలకు వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారట. ఇది ముమ్మాటికీ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమే. ఈ విషయంలో EC జోక్యం చేసుకుని CM పర్యటనను నిలిపివేయాలి’ అని ట్వీట్ చేశారు. ఈ విషయంపై కాసేపట్లో ఆమె ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు.
News November 30, 2025
WGL: యోగా ఫలితాలు ఎప్పుడు సారూ..!

KU అనుబంధం ఉన్న SDLCEలో పరీక్షలు పెట్టడం, ఫలితాలు మరిచిపోవడం ఈ మధ్య ఎక్కువైంది. గతేడాది తీసుకొచ్చిన కొత్త కోర్సు డిప్లొమా ఇన్ యోగా పరీక్షలను ఆగస్టు 12 నుంచి 18 వరకు నిర్వహించారు. పరీక్షలు జరిగి 4 నెలలవుతున్నా ఫలితాలు ప్రకటించకపోవడంతో, ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నామని అభ్యర్థులు వాపోతున్నారు. యోగా డిప్లొమా ఉంటే యోగా టీచర్ ఉద్యోగాలు వస్తాయని, ఈ ఫలితాలు ప్రకటించకపోవడం మూలంగా నష్టపోతున్నామంటున్నారు.
News November 30, 2025
దిత్వ తుఫాన్.. సూర్యాపేట ఎస్పీ సూచన

దిత్వ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు, చలిగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నరసింహ సూచించారు. అత్యవసరమైతే తప్పా ఎవరూ బయటకు రాకూడదని, ధాన్యాన్ని కప్పి ఉంచాలన్నారు. సహాయం కోసం డయల్ 100 లేదా కంట్రోల్ రూమ్ 8712686026కు ఫోన్ చేయాలన్నారు.


