News February 4, 2025
BHPL: నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించాలి: DMHO

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించాలని డీఎంహెచ్వో డాక్టర్.మధుసూదన్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ఎంవో, డాక్టర్లు, సూపర్వైజర్లతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడారు. జాతీయ నులిపురుగుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. 1 నుంచి 19 ఏళ్లు ఉన్న ప్రతిఒక్కరికి నులిపురుగుల నివారణ మాత్రలు వేయాలని సూచించారు.
Similar News
News December 24, 2025
జగిత్యాల జిల్లాలో పెరిగిన హత్యలు: ఎస్పీ

మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడారు. జగిత్యాల జిల్లాలో హత్యల సంఖ్య గత సంవత్సరం కంటే పెరిగిందని తెలిపారు. 2023లో 28 హత్యలు జరగగా, ఈ సంవత్సరం ఇప్పటివరకు 29 హత్యలు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. అయితే, మిగతా నేరాల రేటు గత సంవత్సరం కంటే 5 శాతం తగ్గినట్లు వివరించారు. ఈ క్రమంలో సహకరించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.
News December 24, 2025
కోరుట్ల: భార్యాభర్తల పై దురుసుగా ప్రవర్తించిన నలుగురిపై కేసు

కోరుట్ల పట్టణ శివారులోని పెద్ద గుండు దగ్గర గ్రౌండ్ లో మంగళవారం మద్యం సేవించి తాగిన మత్తులో భార్యాభర్తల పై దురుసుగా ప్రవర్తించిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అడ్డుగా వచ్చిన భర్త పైన దాడి చేసిన సంఘటనలో బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురు వ్యక్తుల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
News December 24, 2025
జగిత్యాల: ‘పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు?’

జగిత్యాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి యావర్ రోడ్డు విస్తరణపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను తీవ్రంగా విమర్శించారు. 2017లోనే 100 ఫీట్ల విస్తరణకు నివేదిక పంపినా, ఎన్నికల లబ్ధి కోసం పనులు అడ్డుకున్నారని ఆరోపించారు. 2021లో జీఓ 94 వచ్చినా అమలు చేయలేదన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి విస్తరణ చేయకపోవడం బాధ్యతారాహిత్యమని వ్యాఖ్యానించారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.


