News February 4, 2025

BHPL: నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించాలి: DMHO

image

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించాలని డీఎంహెచ్వో డాక్టర్.మధుసూదన్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ఎంవో, డాక్టర్లు, సూపర్‌వైజర్లతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడారు. జాతీయ నులిపురుగుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. 1 నుంచి 19 ఏళ్లు ఉన్న ప్రతిఒక్కరికి నులిపురుగుల నివారణ మాత్రలు వేయాలని సూచించారు.

Similar News

News April 12, 2026

ఖమ్మం: తప్పని ‘కట్టెల’ కష్టం.. గ్యాస్‌ సెగతో వ్యాపారం విలవిల

image

గ్యాస్‌ ధరల పెరుగుదల, కొరత సామాన్య వ్యాపారుల పొట్ట కొడుతోంది. కూసుమంచిలోని ఓ హోటల్‌ నిర్వాహకుడు గ్యాస్‌ కష్టాలతో చేసేది లేక కట్టెల పొయ్యిని ఆశ్రయించారు. నిత్యం టిఫిన్ల తయారీ కోసం మండుటెండలో కిలోమీటర్ల మేర నడిచి కట్టెలు సేకరిస్తున్నారు. “మధ్యాహ్నం కట్టెలు తెస్తేనే.. మరుసటి రోజు వ్యాపారం సాగుతుంది” అని సదరు యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రాయితీ సిలిండర్లు అందించాలని కోరుతున్నారు.

News April 12, 2026

విజయవాడలో గంజాయి ముఠా గుట్టురట్టు

image

వియజవాడలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు చర్యలు చేపట్టారు. శనివారం సాయంత్రం శిఖామణి సెంటర్ సమీపంలో గంజాయి ఉందన్న సమాచారం మేరకు మాచవరం పోలీసులు మెరుపు దాడి చేశారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా, జాగర్లమూడి వరుణ్ కుమార్ @ చిన్న బాబు, ప్రత్తిపాటి బాబు @ చింటూ, మరికంటి ప్రభు కుమార్ @ ప్రభు అని సీఐ వెంకటరమణ తెలిపారు. వారి వద్ద నుంచి రెండు కేజీలు గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

News April 12, 2026

ఖమ్మం: అధికారుల ‘కక్కుర్తి’.. ఖజానాకు చిల్లు

image

జిల్లాలో కొందరు ప్రభుత్వ అధికారుల తీరు ‘వేతనం ప్రభుత్వానిది..వాహనం నాది’ అన్నట్లుగా ఉంది. పైస్థాయి అధికారులకు ప్రభుత్వం అద్దె వాహనాలు ఏర్పాటు చేసినప్పటికీ, కొందరు అధికారులు తెరవెనుక సొంత వాహనాలనే వాడుతున్నారు. అయితే, బిల్లులకు మాత్రం ట్యాక్సీ నంబర్లతో నకిలీ పత్రాలను సృష్టిస్తూ ఖజానా లూటీ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ సొమ్ము చేసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.