News January 31, 2025
BHPL: పదో తరగతి విద్యార్థులకు రేపటి నుంచి స్నాక్స్

ప్రభుత్వ స్కూళ్లలో పదో తరగతి చదివే విద్యార్థులకు రాష్ట్ర సర్కార్ తీపి కబురు చెప్పింది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు ఈవెనింగ్ స్నాక్స్ అమలు చేయనుంది. ఇందుకు ఒక్కో విద్యార్థి కోసం రూ.15 చొప్పున ఖర్చు చేయనుంది. పల్లీపట్టి, బిస్కెట్లు, పకోడీ తదితరాలను అందించనున్నారు. జిల్లాలోని 1,563 మంది విద్యార్థులను గాను రూ.8,96,610 నిధులు మంజూరయ్యాయి. వీటిని స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల ఖాతాల్లో జమ చేయనున్నారు.
Similar News
News February 23, 2026
5,138 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

<
News February 23, 2026
పుచ్చలో తామర, కాయ తొలుచు పురుగుల నిర్మూలన ఎలా?

పుచ్చలో తామర పురుగులు ఆకుల కొనలు, పిందెల నుంచి రసం పీల్చడం వల్ల ఆకులు పైకి పడవ ఆకారంలో తిరిగి పిందెలు నల్లబారుతాయి. వీటి నివారణకు లీటరు నీటికి ఇమిడాక్లాప్రిడ్ 0.4ml కలిపి పిచికారీ చేయాలి. కాయ తొలుచు పురుగులను పుచ్చ పంటలో గుర్తిస్తే వాటి నివారణకు లీటరు నీటికి ప్రొఫెనోఫాస్ 2ml (లేదా) స్పైనోసాడ్ 0.3ml (లేదా) ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా కలిపి పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
News February 23, 2026
అతిథి సత్కారాలు ఎలా చేయాలో తెలుసా?

అతిథి సత్కారాలు చేయడమంటే మంచి భోజనం పెట్టి వారి బాగోగులు చూసుకోవడమే కాదట! శాస్త్రాల ప్రకారం అతిథిని ఆహ్వానించేందుకు కొన్ని పద్ధతులున్నాయి. అవి
1.ఇంటిని సుగంధ ద్రవ్యాలతో పరిమళభరితం చేయాలి. 2.అతిథికి స్పష్టమైన వెలుతురునిస్తూ అగ్నిదేవుడి సాక్షిగా ఆహ్వానించాలి. 3.శక్తినిచ్చే పండ్లు, పాలు, తీపి పదార్థాలు అందించాలి. 4.నుదుటిపై తిలకం దిద్ది అక్షతలు వేయాలి. 5. వచ్చిన తర్వాత, వెళ్లేటప్పుడు పూలు ఇవ్వడం.


