News January 31, 2025
BHPL: పదో తరగతి విద్యార్థులకు రేపటి నుంచి స్నాక్స్

ప్రభుత్వ స్కూళ్లలో పదో తరగతి చదివే విద్యార్థులకు రాష్ట్ర సర్కార్ తీపి కబురు చెప్పింది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు ఈవెనింగ్ స్నాక్స్ అమలు చేయనుంది. ఇందుకు ఒక్కో విద్యార్థి కోసం రూ.15 చొప్పున ఖర్చు చేయనుంది. పల్లీపట్టి, బిస్కెట్లు, పకోడీ తదితరాలను అందించనున్నారు. జిల్లాలోని 1,563 మంది విద్యార్థులను గాను రూ.8,96,610 నిధులు మంజూరయ్యాయి. వీటిని స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల ఖాతాల్లో జమ చేయనున్నారు.
Similar News
News February 14, 2025
HYD: క్షణాల్లో కంటి ముందు ఉండాల్సిందే!

HYD ప్రజలు ఆహారం, కూరగాయలు, పండ్లు, బిర్యానీ, నూడుల్స్, పాస్తా తినాలనిపిస్తే అన్ని క్షణాల్లో కంటి ముందు కావాలని కోరుకుంటున్నారు. దీంతో అందుకు అనుగుణంగా ఈ-కామర్స్ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. స్విగ్గీ, జొమాటో, బ్లింక్ ఇట్, బీజె నాయర్, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్, జాంత్రి ఇలా అనేక సంస్థలు అరగంట అంటే, మరొకరు 5 నిమిషాల్లోనే ఆర్డర్ తెచ్చి ఇస్తామంటున్నారు.
News February 14, 2025
HYD: అలా కనిపిస్తే ఫిర్యాదు చేయండి: డిజీ

హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్రమంగా మెడిసిన్ నిల్వలు, తయారీ, విక్రయాలు జరిగితే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని DCA డీకే కమలాసన్ రెడ్డి సూచించారు. 18005996969కు కాల్ చేసి ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. డ్రగ్స్ సంబంధిత సమాచారం అందినా తమకు తెలియజేయాలని సూచించారు.
News February 14, 2025
HYD: ఆ పాలు తాగితే వారికి అనారోగ్యమే..!

చిక్కదనం కోసం మాల్టో డెక్స్‌ట్రిన్ కలిపిన పాలు తాగితే షుగర్ పేషెంట్లకు చక్కర స్థాయిలు పెరిగి, అనారోగ్యానికి తీస్తుందని ఫుడ్ సేఫ్టీ కమిషన్ అధికారులు తెలిపారు. అందుకే HYD నగరం సహా అన్ని ప్రాంతాల్లో పాలలో మాల్టో డెక్స్‌ట్రిన్ కలపటాన్ని నిషేధించినట్లుగా పేర్కొన్నారు. ఇందులో హై గ్లైసిమిక్ ఇండెక్స్ (GI) ఉంటుందని X వేదికగా ట్విట్ చేశారు. పాలపై అనుమానం వస్తే ఫిర్యాదు చేయాలన్నారు.