News March 22, 2025

BHPL: పుష్కరాల ఏర్పాట్లపై మొబైల్ యాప్.. పరిశీలించిన కలెక్టర్

image

పుష్కరాల్లో చేసిన ఏర్పాట్ల సమాచారం భక్తులకు ఉపయోగపడేలా మొబైల్ యాప్ తయారు చేయు అంశాలను భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. మొబైల్ యాప్‌లో సమగ్ర సమాచారం ఉండాలని అధికారులకు సూచించారు. టెంట్ సిటీ ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రధాన కూడళ్లలో తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు సూచించారు. ప్రవేశ మార్గాలు, రోడ్లు మరమ్మతులు, మెరుగుదల పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు.

Similar News

News October 16, 2025

మక్తల్: దొంగల దాడి.. ఇంటి యజమానికి గాయాలు

image

మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్తగార్లపల్లిలో గురువారం అర్ధరాత్రి దొంగలు ఇంట్లోకి చొరబడి మహిళ మెడలోని పుస్తెలతాడు లాక్కోవడానికి యత్నించారు. అడ్డుకున్న ఇంటి యజమాని అంజిలప్పను రాడ్‌తో దెబ్బకొట్టి గాయపరిచారు. ఆ మహిళ అరుపులు కేకలు వేయడంతో గ్రామస్థులు పరుగున చేరుకునే లోపు ముగ్గురిలో ఇద్దరు దొంగలు పరారయ్యారు. ఒక దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News October 16, 2025

మధ్యాహ్నం కేబినెట్ భేటీ.. సురేఖ వస్తారా..?

image

తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా దంపతుల వ్యవహారం మరింత ముదిరింది. పొంగులేటిపై టెండర్ల విషయంలో కామెంట్లు సహా, రెడ్లంతా తమ ఫ్యామిలీపై కుట్ర చేస్తున్నారని ఆమె కూతురు ఆరోపణలు చేయడం తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం కేబినెట్ భేటీ ఉండగా ఆమె వస్తారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. అటు సురేఖ రాజీనామా చేస్తారని కొందరు, ఆమెను తప్పిస్తారని మరికొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది.

News October 16, 2025

కొండా దంపతుల భవిష్యత్ కార్యాచరణ ఏంటి?

image

మంత్రి పొంగులేటితో మొదలైన లొల్లి సుమంత్ విషయం వరకు వెళ్లి సీఎంను కూడా తాకింది. తమపై రెడ్లు కుట్ర చేస్తున్నారంటూ సుష్మిత ఆరోపించగా.. సుమంత్ విషయం తనకేమీ తెలియదని మురళి తెలిపారు. హన్మకొండలోని సురేఖ ఇంటివద్ద పోలీస్ అవుట్ పోస్టునూ తొలగించారు. మరోవైపు ఇవాళ కార్యకర్తలతో కొండా దంపతుల భేటీ ఉండగా.. మురళి మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.