News April 11, 2025

BHPL: పెద్దవాగుకు జలకళ.. రైతుల పాలిట జలధార

image

మహాముత్తారం మండలంలోని మీనాజీపేట, పెగడపల్లి, కేశపూర్, నిమ్మగూడెం, యాత్నారం, సింగంపల్లి గ్రామాల మీదుగా ప్రవహించే పెద్దవాగు జలకళ సంతరించుకుని రైతుల పాలిట వరంగా మారింది. దేవాదుల ప్రాజెక్టు కింద ఉన్న గొల్ల బుద్ధారం పెద్ద చెరువు అలుగు పారే ఈ పెద్దవాగు. ఈ వాగు సంవత్సరం పొడవునా నీటితో ప్రవహిస్తుండటంతో ఆయా గ్రామాల రైతులు వాగుకు మోటార్లు ఏర్పాటు చేసుకుని పంటలు పండించుకుంటున్నారు.

Similar News

News November 23, 2025

సమస్య మీది.. పరిష్కారం మాది: తూ.గో కలెక్టర్

image

ఈనెల 24న కలెక్టరేట్, డివిజన్, మున్సిపల్, మండల, గ్రామ, వార్డు సచివాలయాల వద్ద PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. అర్జీదారులు తమ విజ్ఞప్తులను ముందుగానే ఆన్‌లైన్‌లో Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీల స్థితి, ఇతర వివరాలు తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేసి సమాచారం పొందవచ్చన్నారు. స్వీకరించిన అర్జీలను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు.

News November 23, 2025

సత్యసాయి ఎప్పటికీ జీవించే ఉంటారు: విజయ్ దేవరకొండ

image

సత్యసాయి బాబాకు హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘విజయ్ సాయి’ అని నా పేరును మీరే పెట్టారు. సురక్షితమైన వాతావరణం, విద్యతో పాటు అనేక జ్ఞాపకాలను మాకు ఇచ్చారు. మంచి, చెడులోనూ మీ గురించే ఆలోచిస్తాం. మీరెప్పటికీ జీవించే ఉంటారు’ అని Xలో పేర్కొన్నారు. పుట్టపర్తిలోనే చదువుకున్న విజయ్ బాబాతో దిగిన చిన్ననాటి ఫొటోను షేర్ చేశారు.

News November 23, 2025

వరంగల్: ఇవేం రేషన్ కార్డులు..?

image

ఆయన ముఖ్యమంత్రి కాదు. అలాగని మంత్రి కాదు. కనీసం MLA కూడా కాదు. అయినా అతని ఫొటోలతో కూడిన రేషన్ కార్డులను పంచుతున్నాడు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో కాంగ్రెస్ నేత ఒకరు తన ఫొటో, స్థానిక ఎమ్మెల్యే నాగరాజు ఫొటోలతో కూడిన రేషన్ కార్డులను పంచుతుండటం చర్చనీయాంశమైంది. గ్రామ పంచాయతీ ఎన్నికలున్న నేపథ్యంలో కాంగ్రెస్ తరఫున పంచుతున్నట్లు ఆ కార్డులో ఉంది. ఇలాంటి రేషన్ కార్డులపై మీరేం అంటారు.