News April 11, 2025

BHPL: పెద్దవాగుకు జలకళ.. రైతుల పాలిట జలధార

image

మహాముత్తారం మండలంలోని మీనాజీపేట, పెగడపల్లి, కేశపూర్, నిమ్మగూడెం, యాత్నారం, సింగంపల్లి గ్రామాల మీదుగా ప్రవహించే పెద్దవాగు జలకళ సంతరించుకుని రైతుల పాలిట వరంగా మారింది. దేవాదుల ప్రాజెక్టు కింద ఉన్న గొల్ల బుద్ధారం పెద్ద చెరువు అలుగు పారే ఈ పెద్దవాగు. ఈ వాగు సంవత్సరం పొడవునా నీటితో ప్రవహిస్తుండటంతో ఆయా గ్రామాల రైతులు వాగుకు మోటార్లు ఏర్పాటు చేసుకుని పంటలు పండించుకుంటున్నారు.

Similar News

News April 11, 2026

పాలేరు జలాశయంలో 15 కేజీల జెల్ల చేప

image

కూసుమంచి మండలం పాలేరు జలాశయంలో శనివారం ఓ మత్స్యకారుడికి భారీ చేప చిక్కింది. మండలంలోని కిష్టాపురం గ్రామానికి చెందిన జూలూరి రాములు ఉదయం చేపల వేటకు వెళ్లగా, ఆయన వలలో 15 కేజీల పంకజ జెల్ల పడింది. ఇటీవల కాలంలో ఇంత పెద్ద చేప దొరకడం అరుదని, దీని ధర మార్కెట్‌లో కిలోకు రూ.80 నుంచి రూ.120 వరకు ఉంటుందని మత్స్యకారుడు హర్షం వ్యక్తం చేశారు.

News April 11, 2026

సేంద్రియ ఎరువులు.. సాగులో వాటి ప్రాధాన్యత

image

పంటలు, మొక్కలు ఏపుగా పెరగాలంటే ఎరువులు అవసరం. ఇవి మొక్కలకు కావాల్సిన పోషకాలను అందించి మంచి దిగుబడిని అందిస్తాయి. రసాయన ఎరువులతో కొన్ని దుష్పరిణామాలు ఉన్నందున ప్రస్తుతం చాలా మంది రైతులు సేంద్రియ ఎరువులను వాడుతున్నారు. ఈ ఎరువులను మొక్కలు, జంతువుల వ్యర్థాలు, విసర్జితాల నుంచి తయారుచేస్తారు. సమగ్ర ఎరువుల వాడకంలో సేంద్రియ ఎరువులు ఒక భాగం. రైతులు వీటిని వ్యవసాయంలో తప్పక వాడితే సాగు వ్యయం తగ్గుతుంది.

News April 11, 2026

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అత్యధికం ఇక్కడే

image

గడిచిన 24 గంటల్లో ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. గతంతో పోలిస్తే సమాన స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ ప్రజలు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. అధికారులు వెల్లడించిన వివరాలు.. మెండోరా, భీమ్గల్ 41.6°C, వేంపల్లి బాల్కొండలో 41.5,°C లు నమోదు కాగా నిజామాబాద్ జిల్లాలోని సగం ప్రాంతాల్లో 40°C లకు పైగా రికార్డ్ అయ్యాయి. అటు కామారెడ్డి జిల్లాలో సైతం సోమూర్ 40.3°C, భిక్కనూరు 40.2°C లు నమోదయ్యాయి.