News March 4, 2025

BHPL: పెళ్లికి వెళ్లొస్తుండగా ముగ్గురు దుర్మరణం.. UPDATE

image

రోడ్డు ప్రమాదంలో BHPL జిల్లాకు చెందిన ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాలు.. మహాముత్తారం మండలం మీనాజీపేట గ్రామానికి చెందిన రాజిరెడ్డి, రవీందర్ రెడ్డి ఓ వివాహానికి హాజరై వస్తున్నారు. పంబాపూర్‌కు చెందిన సతీశ్ BHPLకి వస్తున్నాడు. ఈ క్రమంలో రాంపూర్ శివారులోన మూల మలుపు వద్ద ఎదురెదురుగా బైకులు ఢీకొన్నాచి. ఇద్దరు అక్కడికక్కడే మృది చెందగా సతీశ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.

Similar News

News December 4, 2025

ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తాం: కందుల

image

ఆంధ్రప్రదేశ్ లో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. గురువారం రాజమండ్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ సినిమాస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రాజమండ్రి నగరం పర్యాటకం, సంస్కృతి & వినోద రంగాల్లో మరింత అభివృద్ధి చెందేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

News December 4, 2025

HYD: త్రివిధ దళాల్లో నౌకాదళం శక్తిమంతం: రంగారావు

image

త్రివిధ దళాల్లో నౌకాదళం శక్తివంతమైందని, దేశ రక్షణలో కీలకమని నేవీ విశ్రాంత ఆఫీసర్ DP రంగారావు అన్నారు. ‘1969-80 వరకు పని చేశాను. 1971 WARలో ఉన్నాను. 1970-76లో ఒకే షిప్‌లో 6 ఏళ్లు 28 దేశాలు ప్రయాణించాను. 1976లో INS వీరబాహు సబ్ మెరైన్ బేస్ మెయింటెనెన్స్ మెరైన్ ఇంజినీర్‌గా విధులు నిర్వహించాను. సంగ్రామ్ మెడల్, పశ్చిమ స్టార్ మెడల్స్ అందుకున్నాను’ అని నేవీ డే వేళ హయత్‌నగర్‌లో ఆయన Way2Newsతో మాట్లాడారు.

News December 4, 2025

డిగ్రీ లేకపోయినా ఉద్యోగమిస్తా: జోహో CEO

image

జోహో సీఈవో శ్రీధర్ వెంబు సూపర్ ఆఫర్ ఇచ్చారు. నైపుణ్యం ఉంటే చాలని.. డిగ్రీ లేకుండానే ఉద్యోగం ఇస్తానని ప్రకటించారు. పిల్లలపై ఒత్తిడి పెట్టడం మానాలని భారతీయ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. అమెరికాలో యువత డిగ్రీ వదిలి నేరుగా ఉద్యోగాలను ఎంచుకుంటున్న ధోరణిని ఉదాహరణగా చూపించారు. Zohoలో ఏ ఉద్యోగానికీ డిగ్రీ క్రైటీరియా లేదని తెలిపారు. తనతో పనిచేస్తున్న టీమ్‌లో సగటు వయస్సు 19 ఏళ్లు మాత్రమేనని అన్నారు.