News March 4, 2025
BHPL: పెళ్లికి వెళ్లొస్తుండగా ముగ్గురు దుర్మరణం.. UPDATE

రోడ్డు ప్రమాదంలో BHPL జిల్లాకు చెందిన <<15642532>>ముగ్గురు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాలు.. మహాముత్తారం మండలం మీనాజీపేట గ్రామానికి చెందిన రాజిరెడ్డి, రవీందర్ రెడ్డి ఓ వివాహానికి హాజరై వస్తున్నారు. పంబాపూర్‌కు చెందిన సతీశ్ BHPLకి వస్తున్నాడు. ఈ క్రమంలో రాంపూర్ శివారులోన మూల మలుపు వద్ద ఎదురెదురుగా బైకులు ఢీకొన్నాచి. ఇద్దరు అక్కడికక్కడే మృది చెందగా సతీశ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.
Similar News
News November 23, 2025
సింగరేణి ట్రేడ్ మెన్ వారసుడే భూపాలపల్లి ఎస్పీ

సింగరేణి కంపెనీలో బెల్లంపల్లి సివిల్ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న సిరిశెట్టి సత్యనారాయణ కుమారుడు సంకీర్త్ భూపాలపల్లి నూతన ఎస్పీగా నియమితులయ్యారు. అంతకుముందు మిషన్ భగీరథ ఇంజనీర్‌గా పని చేసిన సంకీర్త్, తన ప్రతిభతో సివిల్స్‌లో 330వ ర్యాంకు సాధించి ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. భూపాలపల్లి ఎస్పీగా రావడంతో సింగరేణి ఏరియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
News November 23, 2025
ప.గో: బొలెరో ఢీకొని యువకుడి మృతి

నరసాపురం హైవేపై జరిగిన ప్రమాదంలో మొగల్తూరుకు చెందిన మన్నే ఫణీంద్ర (21) దుర్మరణం పాలయ్యారు. శనివారం పాలకొల్లు నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా వెనుక నుంచి వచ్చిన బొలెరో ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఫణీంద్రను మెరుగైన వైద్యం కోసం భీమవరం తరలిస్తుండగా దారిలో మృతి చెందారు. మృతుడి సోదరుడు వాసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జయలక్ష్మి తెలిపారు.
News November 23, 2025
SRD: తీవ్ర విషాదం.. బిడ్డ మృతి తల్లి సూసైడ్

జహీరాబాద్ మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బిడ్డ మరణం జీర్ణించుకోలేక తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం జరిగింది. మండలంలోని ఎల్గోయికి చెందిన ఐషు(3) అనారోగ్యంతో శనివారం ఉదయం మృతి చెందింది. బిడ్డ మరణాన్ని జీర్ణించుకోలేక మనస్తాపం చెందిన తల్లి లావణ్య(23) శనివారం సాయంత్రం అంత్యక్రియల అనంతరం ఆత్మహత్య చేసుకుంది. గంటల వ్యవధిలో తల్లి, కుమార్తె మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


