News January 27, 2025
BHPL: బాధితుల సమస్యల పరిష్కారానికి వేగవంతంగా చర్యలు: ఎస్పీ

ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ద చూపించాలని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివాస్లో 14 మంది బాధితులతో ఎస్పీ మాట్లాడి ఫిర్యాదులను స్వీకరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. బాధితుల సమస్యల పరిష్కారానికి వేగవంతంగా చర్యలు తీసుకొవాలని సంబధిత పోలీసు అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు.
Similar News
News October 19, 2025
ఏలూరులో నేటి మాంసం ధరలు ఇలా!

నూజివీడులో మాంసం ధరలు స్వల్పంగా పెరిగాయి. కిలో మటన్ రూ.800 రూపాయలు, చికెన్ రూ.220, రొయ్యలు రూ.300 రూపాయలు, చేపలు రూ.180 నుంచి 380 రూపాయలకు విక్రయిస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో కిలో మటన్ రూ.900 రూపాయలు, చికెన్ రూ.220 నుంచి 280 రూపాయలు, కిలో చేపలు రూ.150 నుంచి 400 రూపాయలు, కిలో రొయ్యలు రూ.300 రూపాయలుగా విక్రయిస్తున్నారు.
News October 19, 2025
పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు ప్రారంభం

పదో తరగతి విద్యార్థులు ఈనెల 21 నుంచి పరీక్ష ఫీజులు చెల్లించేందుకు రాష్ట్ర విద్యాశాఖ అనుమతించింది. ఈ మేరకు చిత్తూరు డీఈఓ వరలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర పరీక్షల విభాగం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలు పరీక్ష ఫీజు చెల్లించాలి. పరీక్ష చెల్లించే సమయంలో విద్యార్థులకు తప్పనిసరిగా అపార్ ఐడీ ఉండాలి. ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని హెచ్ఎంలను డీఈఓ ఆదేశించారు.
News October 19, 2025
నేడు చిత్తూరులో ముగింపు సమావేశం

జీఎస్టీ తగ్గింపు వల్ల వివిధ రకాల వస్తువుల ధరల తగ్గుదలపై నెలరోజులుగా జిల్లాలో వివిధ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించారు. నేడు జీఎస్టీ 2.0 ముగింపు సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. చిత్తూరులోని మహాత్మ జ్యోతిరావు ఫూలే భవన్లో ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరుకానున్నారు.