News March 27, 2025
BHPL: మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు

ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌ను తెలంగాణలోని జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పలువురు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిత ప్రకాష్ రెడ్డి జిల్లాకు సంబంధించిన పలు రాజకీయ, సామాజిక అంశాలను మీనాక్షి నటరాజన్‌కు వివరించారు.
Similar News
News December 3, 2025
NZB: 1,760 వార్డులకు 3,764 నామినేషన్లు దాఖలు

జిల్లాలో జరగబోయే 2వ విడత GP 1,760 వార్డు మెంబర్ల (WM) పదవులకు 240 నామినేషన్లు రాగ మొత్తం 3,764 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు చెప్పారు. ఇందులో ధర్పల్లి మండలంలోని 194 WMలకు 417, డిచ్పల్లి(M) 306 WMలకు 621, ఇందల్ వాయి(M) 198 WMలకు 412, మాక్లూర్ (M) 230 WMలకు 466, మోపాల్ (M) 192 WMలకు 425, NZB రూరల్(M) 172 WMలకు 348, సిరికొండ (M) 264 WMలకు 583, జక్రాన్ పల్లి (M) 204 WMలకు 492 నామినేషన్లు వచ్చాయి.
News December 3, 2025
దువ్వూరు: ఎర్రచందనం దొంగపై నాలుగోసారి PD యాక్ట్

దువ్వూరు మండలం పుల్లారెడ్డిపేటకు చెందిన ఎర్రచందనం దొంగ ఇరుగంరెడ్డి నాగ దస్తగిరి రెడ్డిపై నాలుగోసారి పీడీ యాక్ట్ నమోదైనట్లు మైదుకూరు గ్రామీణ సీఐ శివశంకర్ యాదవ్ తెలిపారు. నాగ దస్తగిరి రెడ్డిపై ఇప్పటివరకు మొత్తం 128 కేసులు ఉన్నాయని అన్నారు. వీటిలో ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి 80, మరో 38 చోరీ కేసులు ఉన్నాయని చెప్పారు. ఈయన ప్రస్తుతం కడప కేంద్ర కారాగారంలో ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడని తెలిపారు.
News December 3, 2025
WGL: కుక్కలు వెంబడించి.. యువకుడి దుర్మరణం

వరంగల్ జిల్లాలో విషాదం జరిగింది. గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన శివకుమార్ (గుడ్డు) మచ్చాపూర్ వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రోడ్డు ప్రమాదానికి వీధి కుక్కలు వెంబడించడమే కారణమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. శివకుమార్ మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.


