News March 27, 2025
BHPL: మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు

ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌ను తెలంగాణలోని జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పలువురు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిత ప్రకాష్ రెడ్డి జిల్లాకు సంబంధించిన పలు రాజకీయ, సామాజిక అంశాలను మీనాక్షి నటరాజన్‌కు వివరించారు.
Similar News
News April 18, 2025
ఉదయాన్నే నోటిని ఆయిల్‌తో పుక్కిలిస్తే..

ఉదయాన్నే నోటిని ఆయిల్‌తో పుక్కిలించడం వల్ల దంతాలు శుభ్రపడడంతో పాటు బలోపేతం అవుతాయని, నోటి దుర్వాసన పోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చర్మంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంని, శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపేస్తుందని పేర్కొంటున్నారు. ఆయిల్ పుల్లింగ్ కోసం కొబ్బరి/ నువ్వుల/ సన్ ఫ్లవర్ నూనెను ఉపయోగించవచ్చని.. 15-20min పుక్కిలించి, తర్వాత గోరువెచ్చని నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.
News April 18, 2025
కర్నూలులో క్వింటా ఉల్లి రూ.879

ఉల్లి ధరలు భారీగా పడిపోయాయి. కర్నూలు మార్కెట్‌కు నిన్న 479 క్వింటాళ్ల సరకు రాగా గరిష్ఠ ధర క్వింటా రూ.879, కనిష్ఠ రూ.675, సగటు రూ.755 పలికింది. మహారాష్ట్ర నుంచి జిల్లాకు భారీగా దిగుమతి అవుతుండటంతో ధరలపై ఎఫెక్ట్ పడిందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక మిర్చి క్వింటా రూ.4వేల నుంచి రూ.7వేల వరకు పలుకుతోంది.