News February 2, 2025
BHPL: రేపటి నుంచి జిల్లాలో క్రికెట్ టోర్నమెంట్

రేపటి నుంచి జిల్లాలోని వివిధ శాఖలతో క్రికెట్ టోర్నమెంట్‌తో పాటు పోలీసు అధికారులు సిబ్బందికి పలు క్రీడలు నిర్వహించనున్నట్లు ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు. ఈ క్రీడలు ఈ నెల 3 నుంచి 6 వరకు కొనసాగనున్నాయని, పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ అంబేడ్కర్ స్టేడియంతో పాటు కాకతీయ స్టేడియంలో జరగనున్నాయని చెప్పారు.
Similar News
News February 9, 2025
సినిమా ఆఫర్.. మాజీ CM కూతురికి రూ.4 కోట్లు టోకరా

సినిమా ఆఫర్ ఇస్తామంటూ కొందరు ఉత్తరాఖండ్ మాజీ CM రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ కూతురు ఆరుషికి రూ.4 కోట్లకు టోకరా పెట్టారు. ముంబైకి చెందిన వరుణ్, మాన్సీలు నిర్మాతలమంటూ పరిచయం చేసుకున్నారు. విక్రమ్ మాస్సే హీరోగా తెరకెక్కించే మూవీలో కీలక పాత్రతో పాటు లాభంలో 20% షేర్ ఇస్తామని, పెట్టుబడి పెట్టాలని చెప్పారు. ఇది నమ్మి ఆమె విడతలవారీగా రూ.4 కోట్లు ఇచ్చారు. మూవీ ప్రారంభం కాకపోవడంతో మోసం చేశారని కేసు పెట్టారు.
News February 9, 2025
మంచిర్యాల జిల్లాలో నేటి TOP NEWS

*అంకుశం వైపు పులి కదలికలు*వైభవంగా వేలాల గట్టు మల్లన్న గిరి ప్రదక్షిణ *బార్‌లో దాడి ఘటనలో ముగ్గురి రిమాండ్*రాజకీయ జోక్యంతో దిగజారుతున్న సింగరేణి*గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరకు ఎమ్మెల్యేకు ఆహ్వానం
News February 9, 2025
పెద్దాపురంలో డివైడర్ పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

పెద్దాపురంలో డివైడర్ పైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ఆదివారం రాత్రి పెద్దాపురం దర్గా సెంటర్ సమీపంలో కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్తున్న బస్సు పెద్దాపురంలో ప్రమాదవశాత్తు డివైడర్ మీదకు వెళ్లింది. దీనితో ప్రయాణికులంతా భయాందోళనలకు గురయ్యారు. అయితే బస్సులో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఈ ఘటనతో అక్కడ వాహనాలు నిలిచిపోయి, భారీ ట్రాఫిక్ ఏర్పడింది.