News April 9, 2025
BHPL: వర్షంతో కూలిన షెడ్డు.. నిరాశ్రయురాలిగా వృద్ధురాలు

భూపాలపల్లి మండలం కొత్తపల్లి సమ్మె గ్రామంలో సోమవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షంతో కురిసిన విషయం తెలిసిందే. దీంతో వృద్ధురాలు సరోజనకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. తనను ప్రభుత్వమే ఆదుకోవాలని, ఇల్లు నిర్మించుకునే స్థోమత లేదని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.
Similar News
News December 16, 2025
ధర్మారం: సర్పంచ్‌గా బాలింత..!

ధర్మారం మండలం బుచ్చయ్యపల్లిలో నేరెళ్ల వంశిక 239 ఓట్లతో సర్పంచ్‌గా విజయం సాధించారు. 4 ఏళ్ల క్రితం ఈమెకు వివాహం కాగా, 11 రోజుల క్రితమే కుమార్తెకు జన్మనిచ్చారు. గ్రామస్థుల సూచనతో, కాంగ్రెస్ మద్దతుతో నామినేషన్ వేసిన వంశిక మొన్న జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు. 4 రోజుల క్రితం వరకు ఆసుపత్రిలో ఉన్న ఆమె, పోలింగ్ కేంద్రానికి వచ్చి ధ్రువీకరణ పత్రం స్వీకరించారు. గ్రామస్థులు వంశికకు అభినందనలు చెప్పారు.
News December 16, 2025
కేసీఆర్ మీటింగ్ వాయిదా

TG: ఈ నెల 19న KCR అధ్యక్షతన జరగాల్సిన BRSLP సమావేశం వాయిదా పడింది. ఈ మీటింగ్‌ను 21వ తేదీన నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. 19న పార్లమెంట్ సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో BRS MPలు కూడా ఈ భేటీలో పాల్గొనాలనే ఉద్దేశంతో వాయిదా వేశామని తెలిపారు. ఈ మీటింగ్‌లో కృష్ణా-గోదావరి నదులపై BRS సర్కార్ పదేళ్లలో చేపట్టిన ప్రాజెక్టులు, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై చర్చిస్తారని సమాచారం.
News December 16, 2025
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌కు ఊరట

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ <<16467368>>కేసు<<>>లో కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ గాంధీలకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఊరటనిచ్చింది. ED దాఖలు చేసిన PMLA ఫిర్యాదును స్వీకరించేందుకు కోర్టు నిరాకరించింది. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ విచారణను కొనసాగించవచ్చని కోర్టు పేర్కొంది. ఏజేఎల్ (Associated Journals Limited) ఆస్తుల బదిలీపై ఈడీ ఆరోపణలు చేస్తోంది.


