News February 2, 2025

BHPL: ‘శాసన మండలి ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి’

image

శాసన మండలి ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. జిల్లాలో 7 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశామని, 333 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.

Similar News

News November 25, 2025

జాతీయస్థాయి పోటీలకు సిక్కోలు విద్యార్థిని ఎంపిక

image

జి.సిగడం కేజీబీవీ ఇంటర్మీడియట్ మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థిని ఆర్.స్వాతి జాతీయస్థాయి పరుగు పందేనికి ఎంపికైంది. హర్యానాలో ఈ నెల 26 నుంచి 30 వరకు అండర్-19 క్యాటగిరీలో 4×100 రిలే పరుగు పందెంలో పాల్గొననుంది. రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రదర్శనతో జాతీయస్థాయికి ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రమీల తెలిపారు. విద్యార్థినిని ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.

News November 25, 2025

సంగారెడ్డి సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు

image

జిల్లాలోని 613 పంచాయతీలకు అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేశారు. మొత్తం 271 స్థానాలు జనరల్‌కు కేటాయించగా అందులో 130 మహిళలకు, 141 పురుషులకు కేటాయించారు. బీసీలకు మొత్తం 1117కు పురుషులకు 65, మహిళలకు 52, ఎస్సీలో మొత్తం 126 స్థానాలకు పురుషులకు 70 మహిళలకు 56, ఎస్టీ కేటగిరీలో మొత్తం 18 స్థానాలకు పురుషులకు 12 మహిళలకు 6 స్థానాలు కేటాయించారు.

News November 25, 2025

ఉత్తర తెలంగాణకు రూ.10,000కోట్ల NH ప్రాజెక్టులు

image

తెలంగాణలో రూ.10,034 కోట్ల అంచనా వ్యయంతో 4 కీలక జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. NH-167(MBNR-గుడెబల్లూర్ -80kms) ₹2,662 కోట్లు, NH-63 (అర్మూర్-జగిత్యాల, 71kms) ₹2,338 కోట్లు, NH-63 (జగిత్యాల-మంచిర్యాల, 68kms) ₹2,550 కోట్లు, NH-563 (JGL-KNR, 59kms)కి ₹2,484 కోట్లతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కొత్త NHలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రవాణా కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తాయి.