News February 2, 2025
BHPL: ‘శాసన మండలి ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి’

శాసన మండలి ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. జిల్లాలో 7 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశామని, 333 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.
Similar News
News February 9, 2025
నవీపేట్: కెమెరాల పని తీరును పరిశీలించిన DIEO

రెండో దశ ప్రయోగ పరీక్షలు జరుగుతున్న నవీపేట్ మోడల్ జూనియర్ కళాశాల, నవోదయ జూనియర్ కళాశాలల్లో కెమెరాల పని తీరును నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి రవి కుమార్ ఆదివారం స్వయంగా పరిశీలించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో కెమెరాలకు జియో ట్యాగింగ్ ఉందా లేదా అని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కెమరాలు ఆగిపోకుండా ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ పని చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News February 9, 2025
రేపు కలెక్టరేట్‌లో ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ

నంద్యాలలోని కలెక్టరేట్‌లో ఈనెల 10వ తేదీ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ఆయా శాఖల అధికారులు హాజరు కావాలని సూచించారు. ప్రజలు కూడా తమ సమస్యలపై అర్జీలు చేసుకోవచ్చని చెప్పారు.
News February 9, 2025
బంగారుపాల్యం: ప్రాణం తీసిన ఈత సరదా

ఈత సరదా ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఈ ఘటన బంగారుపాల్యం మండలం మొగిలిలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ఫిబ్రవరి 7న సెల్వరాజ్ స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లాడు. ఈత రాకపోయిన చెరువులో దిగడంతో గల్లంతయ్యాడు. రెండు రోజులు సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో అగ్నిమాపక దళం తీవ్రంగా శ్రమించి మృతదేహాన్ని చెరువు నుంచి ఆదివారం వెలికి తీశారు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.