News March 27, 2025
BHPL: సెర్ఫ్ లక్ష్యాల సాధనకు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

సెర్ఫ్ లక్ష్యాల సాధనకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్ తెలిపారు. గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి, సెర్ఫ్ కార్యక్రమాలపై సెర్ఫ్ సీఈఓ దివ్యతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. ఐకేపీలకు పెండింగ్ కమిషన్ బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని వివరిచారు.
Similar News
News October 18, 2025
ఆసిఫాబాద్ జిల్లాలో గర్భిణీ దారుణ హత్య

ఆసిఫాబాద్ జిల్లాలో గర్భిణి మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దహెగాం మండలం గేర్రె గ్రామంలో కోడలు రాణిని మామ సత్తయ్య దారుణంగా హత్య చేశాడు. కొడుకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడనే కోపంతో హత్య చేసి ఉంటాడని గ్రామస్థులు తెలిపారు. హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 18, 2025
మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్

స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు నగరంలోని ఏ–క్యాంపు మున్సిపల్ పార్కులో జిల్లా కలెక్టర్ సిరి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ప్రతి వాడ, ప్రతి కాలనీలో పచ్చదనం విస్తరించేలా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
News October 18, 2025
ప్రజా రవాణా వ్యవస్థలను వినియోగించుకోవాలి: కలెక్టర్

ప్రజారవాణా వ్యవస్థలను వినియోగించుకోవాలని కలెక్టర్ విజయ్ కృష్ణన్ పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి కలెక్టరేట్లో నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. వాహన కాలుష్యాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సోలార్ విద్యుత్ వినియోగం వంటి పద్ధతులను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు.