News January 13, 2026

BHPL: ఆస్తి కోసం తమ్ముడిపై అన్న కుటుంబం దాడి

image

గణపురం మండలం సీతారాంపురంలో ఆస్తి వివాదం నేపథ్యంలో అన్న, అతడి భార్య, కుమారులు కలిసి తమ్ముడిపై కర్రలతో దాడి చేసి హత్యాయత్నం చేసిన ఘటన చోటుచేసుకుంది. వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటకు చెందిన మహమ్మద్ సర్వర్ అహ్మద్‌పై తీవ్రంగా దాడి చేయగా తలకు గాయాలయ్యాయి. బాధితుడు భూపాలపల్లి 100 పడకల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటనపై గణపురం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 15, 2026

టెన్త్ పరీక్షలకు వైభవ్ సూర్యవంశీ దూరం

image

భారత U19 క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ టెన్త్ పరీక్షలకు హాజరవుతారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే బిజీ క్రికెట్ షెడ్యూల్ కారణంగా ఆయన ఈ ఏడాది పరీక్షలకు హాజరు కావట్లేదని స్కూల్ డైరెక్టర్ తెలిపారు. ఈ విషయాన్ని వైభవ్ తండ్రి సంజీవ్ చెప్పారని పేర్కొన్నారు. వరుస టోర్నమెంట్లు, ట్రైనింగ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఇటీవల జరిగిన U19 WCలో వైభవ్ 7 మ్యాచుల్లో 439 రన్స్ చేసి సత్తా చాటారు.

News February 15, 2026

అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్ల పనులు వేగవంతం

image

అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మిస్తున్న నివాస భవనాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. టవర్ల నిర్మాణం మరో రెండు నెలల్లో పూర్తి కానుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నివాస భవనాలు పూర్తి స్థాయిలో సిద్ధం కావడానికి నాలుగు నెలల సమయం పడుతుంది. రాజధాని పనుల్లో వేగం పెంచిన ప్రభుత్వం, వీటిని త్వరగా పూర్తి చేసి ప్రజాప్రతినిధులకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది.

News February 15, 2026

తిరుపతి: అర్జీల స్థితి తెలుసుకోవాలని ఉందా?

image

తిరుపతి జిల్లా కలెక్టరేట్‌లో ఫిబ్రవరి 16న సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. ప్రజలు తమ అర్జీలు సమర్పించి సమస్యలకు పరిష్కారం పొందాలని కోరారు. ఇప్పటికే ఇచ్చిన అర్జీల స్థితి తెలుసుకోవడానికి 1100 నంబర్ లేదా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ను వినియోగించుకోవచ్చన్నారు.