News December 13, 2025
BHPL: ఎన్నికల ఖర్చులు.. లెక్క చెప్పాల్సిందే!

జిల్లాలో 248 గ్రామ పంచాయతీలు, 2,102 వార్డులు ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓడిన గెలిచిన ప్రచారం కోసం పెట్టిన ప్రతి రూపాయి ఖర్చు లెక్క ఎన్నికల కమిషన్‌కు చెప్పాలి. ఏ విడత ఎన్నిక అయినా నామినేషన్ వేసిన రోజు నుంచి పోలింగ్ ముగిసిన రోజు వరకు సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల్లో ప్రతి ఒక్క అభ్యర్థి ఎన్నికల కోసం నిర్వహించిన లావాదేవీలు నమోదు చేయాల్సిందే.
Similar News
News December 18, 2025
రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్ ఇలా త్రిపాఠి

ధాన్యం కొనుగోలు వివరాలను రికార్డుల్లో పక్కాగా నమోదు చేయాలని, ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి కేంద్రాల నిర్వాహకులను హెచ్చరించారు. గురువారం ఆమె అనుముల మండలం కొత్తపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా చేశారు. రిజిస్టర్లు, ధాన్యం తేమ శాతం, తూకం వేసిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు లోడ్ చేయాలని ఆదేశించారు.
News December 18, 2025
అక్రమ మద్యం.. గంజాయి పట్టివేత: ASF SP

ఆసిఫాబాద్ జిల్లాలో 3 విడతల వారిగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు ASF జిల్లా SP నితికా పంత్ అన్నారు. జిల్లాలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రూ.22 వేల నగదుతో పాటు 324 లీటర్ల అక్రమ మద్యం పట్టుబడినట్లు ఆమె తెలిపారు. అదే విధంగా 18 గంజాయి మొక్కలతో పాటు 2.6 కిలోల ఎండు గంజాయి పట్టుబడినట్లు పేర్కొన్నారు. 959 మందిని బైండోవర్ చేసినట్లు వెల్లడించారు.
News December 18, 2025
‘టెన్త్ పరీక్షల్లో 100% ఫలితాలు సాధించాలి’

STUTS మెదక్ జిల్లా 2026 నూతన సంవత్సర క్యాలండర్‌ను అదనపు కలెక్టర్ నగేష్ ఆవిష్కరించారు. జిల్లా విద్యాధికారి విజయ, జిల్లా అధ్యక్షుడు రాజగోపాల్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నరేష్ పాల్గొన్నారు. అదనపు కలెక్టర్మా ట్లాడుతూ.. STUTS సంఘ బాధ్యులు పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో సహకరించడం అభినందనీయమన్నారు. టెన్త్ పరీక్షల్లో 100% ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాధికారి విజయ అన్నారు.


