News February 11, 2025
BHPL: ‘ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలి’

ఈ నెల 27న జరుగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ అన్నారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణకు విధులు కేటాయించిన అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయ ఎన్నికల పోలింగ్ నిర్వహణపై అధికారులు సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.
Similar News
News April 5, 2026
పాలమూరు: ప్రేమించి పెళ్లి.. వేధించి ప్రాణం తీశాడు!

ప్రేమ వివాహం చేసుకున్న భార్యనే భర్త కిరాతకంగా చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాలు.. MBNR జిల్లా మూసాపేట (M) పోల్కంపల్లికి చెందిన చందు 8 నెలల క్రితం శ్రీదేవి(19)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ తీవ్రంగా జరగడంతో ఆమెను కొట్టి హత్య చేశాడు. చందు వరికోత మిషన్ డ్రైవర్‌గా, ఆమె నర్సుగా పని చేస్తున్నారు. మూసాపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News April 5, 2026
న్యూక్లియర్ ముప్పు.. ఐరాసకు ఇరాన్ లెటర్

ఇరాన్‌లోని ఏకైక అణు విద్యుత్ కేంద్రం ‘బుషెహర్’ సమీపంలో జరుగుతున్న వరుస దాడులపై ఆ దేశ విదేశాంగ మంత్రి అరాఘ్చీ ఐరాసకు లేఖ రాశారు. ఈ అటాక్స్ వల్ల రేడియోధార్మికత వెలువడే ప్రమాదం ఉందన్నారు. దీనివల్ల కేవలం ఇరాన్‌కే కాకుండా పొరుగు దేశాలకూ తీరని నష్టం కలుగుతుందని హెచ్చరించారు. దీనిపై అంతర్జాతీయ సమాజం స్పందించాలని కోరారు. తాజాగా ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఈ కేంద్రంపై నాలుగోసారి దాడి చేశాయి.
News April 5, 2026
నల్గొండ: కేరళంలో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

కేరళం రాష్ట్రం కొచ్చిలోని గిరిజన నైపుణ్య శిక్షణా సంస్థలో మే నెలలో ప్రారంభమయ్యే 6నెలల శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నారు. ఇందులో తెలంగాణ గిరిజన యువతకు 25సీట్లు కేటాయించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 10లోపు https://dsapponline.com/sds/form/register.php వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు నల్గొండలోని జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచించారు.


