News December 13, 2025

BHPL: ఒక్క రోజే గడువు.. ప్రలోభాలతో ఓట్లకు ఎర!

image

BHPL(D)లో 2వ విడత పోలింగ్‌కు ఒక్క రోజే గడువుంది. 79 పంచాయతీలకు, 547 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. డబ్బు, మద్యం మాంసంతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు సమాచారం. ఓటు కోసం సర్పంచ్, వార్డుల అభ్యర్థులు డబ్బులు విచ్చలవిడిగా వెదజల్లుతండగా.. మహిళలను ఆకర్షించేందుకు చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Similar News

News December 14, 2025

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో భారీగా ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(<>SAIL<<>>)లో 124 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఇంజినీరింగ్ డిగ్రీ(BE/ B.Tech) ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1050, SC,ST,PwBDలకు రూ.300. వెబ్‌సైట్: www.sail.co.in

News December 14, 2025

యుద్ధరంగంలో మెదక్ ఫ్యాక్టరీ సత్తా..!

image

​భారత సైన్యం వినియోగించే అత్యాధునిక (BMP-II) యుద్ధ వాహనాలకు సంబంధించి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ (OFM)వార్షిక ఉభయచర పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది. సంగారెడ్డిలోని యెడమైలారం కేంద్రంలో తయారైన ఈకంబాట్ వాహనాల ట్రయల్స్‌ను మల్కాపూర్ చెరువులో నిర్వహించారు. ఈBMP-II,దాని ఇతర స్పెషలైజ్డ్ వేరియంట్లు నీటిలో,భూమిపై తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నాయి.ఈ విజయం దేశీయ రక్షణ ఉత్పత్తుల నాణ్యతను మరోసారి చాటింది.

News December 14, 2025

93ఏళ్ల అకాడమీ చరిత్రలో తొలి లేడీ ఆఫీసర్

image

డెహ్రాడూన్‌ ఇండియన్ మిలిటరీ అకాడమీలో నిన్న పాసింగ్ అవుట్ <<18552803>>పరేడ్<<>> జరిగిన విషయం తెలిసిందే. 93 ఏళ్ల ఆ అకాడమీ చరిత్రలో తొలిసారి ఓ మహిళా ఆఫీసర్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఇండియన్ ఆర్మీలో చేరారు. ఆమె మరెవరో కాదు మహారాష్ట్రకు చెందిన సయీ S జాదవ్. ఆమె తండ్రి, తాత ఇండియన్ ఆర్మీలో, ముత్తాత బ్రిటిష్ సైన్యంలో సేవలందించారు. ఆ లెగసీని కంటిన్యూ చేసేందుకే తాను ఆర్మీలో చేరినట్లు ఈ లేడీ ఆఫీసర్ చెబుతున్నారు.