News September 14, 2025
BHPL: కారులో పాము.. తృటిలో తప్పిన ప్రమాదం

భూపాలపల్లి అంబేడ్కర్ సెంటర్ వద్ద ఓ కారులో పాము కలకలం సృష్టించింది. కారు డోర్ తీసి చూడగా వింత శబ్దాలు రావడంతో యజమాని లోపల పామును చూసి భయాందోళనకు గురయ్యాడు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇవ్వగా, అతడు వచ్చి పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Similar News
News September 14, 2025
రేపు నంద్యాల కలెక్టరేట్లో ప్రజా వినతుల స్వీకరణ

నంద్యాల జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మునిసిపల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు. ఇందులో భాగంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు వెల్లడిచారు. ప్రజలు తమ ఫిర్యాదులను కలెక్టరేట్‌కు వచ్చే అవసరం లేకుండా “meekosam.ap.gov.in”లో ద్వారా కూడా సమర్పించవచ్చునన్నారు.
News September 14, 2025
‘టీజీఈ హైట్స్ ప్రాజెక్టు విజయవంతం చేయండి’

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఉద్యోగులు TGE హైట్స్ ప్రాజెక్టును విజయవంతం చేయాలని TGO రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు అన్నారు. ఖమ్మం పోలేపల్లిలోని రాజీవ్ స్వగృహ నందు ప్రభుత్వ ఉద్యోగుల హౌస్ బిల్డింగ్ సొసైటీకి టెండర్ దక్కినందుకు సమావేశం నిర్వహించారు. CM రేవంత్, జిల్లా మంత్రుల సహకారంతో ప్రభుత్వ ఉద్యోగులకు అతి తక్కువ ధరలో గృహ సదుపాయం కల్పించాలనే సదుద్దేశంతో ఈ ప్రాజెక్టు సాధించుకున్నామన్నారు.
News September 14, 2025
ప్రశాంతంగా లైసెన్స్ సర్వేయర్ సప్లిమెంటరీ పరీక్షలు

ఖమ్మం జిల్లాలో లైసెన్స్ సర్వేయర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఆదివారం ఖమ్మం SR&BGNR కళాశాలలో ఇట్టి పరీక్షలు చేపట్టినట్లు చెప్పారు. ఉదయం సెషన్‌లో చేపట్టిన థియరీ పరీక్షకు 129 మంది అభ్యర్థులకు గాను 128 మంది, మధ్యాహ్నం నిర్వహించిన ప్లాటింగ్ పరీక్షకు 205 మంది అభ్యర్థులకు గాను 202 మంది హాజరైనట్లు పేర్కొన్నారు.