News March 30, 2025

BHPL: కొత్త సంవత్సరం.. స్థానిక సమరం!

image

స్థానిక సంస్థల ఎన్నికల ఆశావహులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రాజకీయ భవిష్యత్‌ను తేల్చనుంది. భూపాలపల్లి జిల్లాలో త్వరలో జరిగే సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఈ నూతన సంవత్సరంలో జరగనున్నాయి. వీటితో పాటు ఈ ఏడాది భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన రాజకీయ ఆశావహులకు ఈ ఏడాది ‘కీ’ రోల్ కాబోతోంది.

Similar News

News February 27, 2026

UPSC అభ్యర్థులకు ట్యాబ్‌ల అందజేత

image

యూపీఎస్సీ(UPSC) పరీక్షల్లో ఉచిత శిక్షణకు ఎంపికైన నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎస్సీ అభ్యర్థులకు కలెక్టర్ హిమాన్సు శుక్లా అధ్యాయన సామాగ్రితో కూడిన డిజిటల్ ట్యాబ్‌లను అందజేశారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వీటిని అభ్యర్థులకు అందజేశారు. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులను ఆయన అభినందించారు.

News February 27, 2026

సునీల్ నాయక్ ఘటన.. బిహార్ హోంశాఖ కీలక నిర్ణయం

image

బిహార్ హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర క్యాడర్ పోలీసులపై చర్యలు తీసుకోవాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల IPS సునీల్ నాయక్ ఘటనతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే <<19220184>>పట్నా కోర్టు<<>> IG స్థాయి అధికారిపై AP పోలీసుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. బిహార్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ వారెంట్/కేస్ డైరీ వెంట లేకుండా సునీల్‌ను అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టింది.

News February 27, 2026

జగిత్యాల: మూడో రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతం.. 97.19% హాజరు

image

జగిత్యాల జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు మూడవ రోజు ప్రశాంతంగా కొనసాగాయి. జిల్లాలోని 30 పరీక్ష కేంద్రాల్లో జనరల్ కోర్సులకు 6,750 మందికి గాను 6,614 మంది హాజరుకాగా 136 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సుల్లో 1,142 మందికి 1,057 మంది పరీక్ష రాయగా 85 మంది గైర్హాజరయ్యారు. మొత్తం హాజరు శాతం 97.19గా నమోదైంది. జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్.లత రాయికల్‌లోని పరీక్ష కేంద్రాలను పరిశీలించారు.