News August 20, 2025

BHPL: గోదావరి వరద ఉధృతి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్‌

image

భూపాలపల్లి జిల్లాలో గోదావరి నది నీటిమట్టం పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ సూచించారు. కాళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశామన్నారు. బుధవారం కలెక్టర్‌, ఎస్పీ కిరణ్‌ ఖరేతో కలిసి కాళేశ్వరంలోని గోదావరి, సరస్వతి ఘాట్ల వద్ద వరద పరిస్థితిని పరిశీలించారు. ప్రజల ప్రాణాలను రక్షించే విషయంలో యంత్రాంగం నిత్యం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News August 20, 2025

WGL: పెండింగ్‌ చలాన్లు చెల్లించకపోతే వాహనాలు సీజ్‌

image

పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్‌ చలాన్లు చెల్లించని వాహనాలను సీజ్‌ చేస్తామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ వాహనదారులకు హెచ్చరించారు. వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 1,27,194 వాహనాలపై 11,71,094 చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు. వాహనదారులు తమ పెండింగ్‌ చలాన్లను వెంటనే చెల్లించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

News August 20, 2025

ADB: ముంబయిలో వర్షాలు.. 2 రైళ్లు రద్దు

image

ముంబాయిలో భారీ వర్షాల కారణంగా గురువారం రెండు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు పీఆర్వో రాజేశ్ షిండే ఒక ప్రకటన విడుదల చేసింది. గురువారం నాటి జాల్నా-ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు(నంబరు 20705), బల్లార్ష-ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ నందిగ్రాం ఎక్స్‌ప్రెస్ రైలు(నెంబరు 11002) రద్దు చేశామన్నారు. ఆదిలాబాద్ ప్రయాణికులు గమనించాలని సూచించారు.

News August 20, 2025

శ్రీశైలం MLA తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

image

AP: అటవీ సిబ్బందితో శ్రీశైలం MLA రాజశేఖర్‌రెడ్డి <<17465291>>వివాదం<<>>పై CM చంద్రబాబు ఆరా తీశారు. ఘర్షణ జరిగిన తీరుపట్ల ఎమ్మెల్యేపై ఆయన మండిపడ్డారు. వివాదాలకు ఆస్కారం ఇవ్వడంపై CM అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలన్నారు. ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. CM ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.