News April 2, 2025
BHPL: ఘోర ప్రమాదం.. 20 మందికి గాయాలు

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం వలస కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. స్థానికుల వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన 20 మంది వలస కూలీలు వాహనంలో వెళ్తుండగా కమలాపూర్-రాంపూర్ గ్రామాల మధ్య వాహనం ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది వలసకూలీలకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు కూలీలను భూపాలపల్లిలోని 100 పడకల ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 1, 2025
ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన విద్య అందించాలి

ప్రభుత్వ విద్యా సంస్థల్లో పిల్లలకు మెరుగైన విద్యను అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణి ఆదేశించారు. శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ రాజార్షి షా, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, విద్యాశాఖ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. నాణ్యమైన బోధన, మౌలిక వసతుల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె సూచించారు.
News November 1, 2025
ADB: జూబ్లీ పోరు.. మనోళ్ల ప్రచార జోరు

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రతి జిల్లా నుంచి ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు అక్కడికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి ADB నుంచి కాంగ్రెస్ నేత, మంత్రి వివేక్ వెంకటస్వామి,బీఆర్ఎస్ నుంచి అనిల్ జాదవ్, బాల్క సుమన్ తదితర నేతలు ప్రచారం జోరు పెంచారు. వీరితోపాటు మండల నేతలను తీసుకెళ్లడంతో ఎంత ప్రభావం చూపుతారోననే ఆసక్తి నెలకొంది.
News November 1, 2025
ఆదిలాబాద్: ఓపెన్ ఫలితాలు విడుదల

TOSS ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలైనట్లు DEO ఖుష్బూ గుప్తా, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ అశోక్ తెలిపారు. సెప్టెంబర్ 22 – 28వరకు జరిగిన పరీక్షల ఫలితాలు https://www.telanganaopenschool.org/ వెబ్ సైట్‌లో పొందుపర్చినట్లు పేర్కొన్నారు. మెమోల్లో పొరపాట్లుంటే ఈ నెల 14వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పదో తరగతి రీకౌంటింగ్ కోసం పేపర్ కు రూ.350, ఇంటర్‌కు రూ.400 చెల్లించాలన్నారు.


