News March 30, 2025

BHPL: తెలుగు ప్రజల సంస్కృతిని ప్రతిబింబించే పండుగ: కలెక్టర్

image

భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఉగాది పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ… ఉగాది తెలుగు ప్రజల సంస్కృతిని ప్రతిబింబించే గొప్ప పండుగ అని అన్నారు. కొత్త ఆశలతో నూతన ఉత్సాహంతో నిండిన విశేషమైన రోజని పేర్కొన్నారు. జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో, శాంతి సౌభాగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ అభివృద్ధి సాధించాలని అన్నారు.

Similar News

News November 11, 2025

ఇరిగేషన్ శాఖకు రూ.52.5 కోట్ల నష్టం

image

ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా మొంథా తుఫాన్ ఎఫెక్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై అధికంగా పడింది. ప్రధానంగా మున్నేరు ఉదృతంగా ప్రవహించడంతో అనేక ప్రాంతాల్లో కాలువలు కోతకు గురయ్యాయి. వంతెనలు దెబ్బతిన్నాయి. మైనర్ ఇరిగేషన్ డామేజ్ 91 ప్రాంతాల్లో జరగగా రూ.32.5cr నష్టం వాటిల్లింది. మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.12.5cr, మేజర్ ఇరిగేషన్ రూ.7.5cr, కల్వర్టులకు రూ. 3.64cr వరకు ఖర్చవుతాయని అధికారులు తేల్చారు.

News November 11, 2025

బిహార్‌ ఎన్నికలు: 9 గంటల వరకు 14.55% పోలింగ్

image

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 14.55% పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. 122 నియోజకవర్గాలకు జరుగుతున్న పోలింగ్‌లో ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ లైన్‌లో వేచి ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో కీలకమైన మగధ్, చంపారన్, సీమాంచల్‌లో ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొదటి విడతలో 64.66% పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే.

News November 11, 2025

భద్రాద్రి పాలకమండలి ఏర్పాటుపై పడని ముందడుగు

image

భద్రాద్రి రామాలయానికి ఉమ్మడి ఏపీలో 2012 NOV 25 వరకు ట్రస్ట్ బోర్డు పనిచేసింది. అనంతరం పాలకమండలి ఏర్పాటుపై గత ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్లో పాలకమండలి ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 50మందికి పైగా దరఖాస్తు సమర్పించారు. అయినా నేటికి పాలకమండలి ఏర్పాటుపై అడుగు ముందుకు పడలేదు. 3రోజుల క్రితం సర్కారు సిగ్నల్ ఇవ్వడంతో మరోసారి నోటిఫికేషన్ విడుదల కానుంది.