News March 4, 2025

BHPL: పెళ్లికి వెళ్లొస్తుండగా ముగ్గురు దుర్మరణం.. UPDATE

image

రోడ్డు ప్రమాదంలో BHPL జిల్లాకు చెందిన <<15642532>>ముగ్గురు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాలు.. మహాముత్తారం మండలం మీనాజీపేట గ్రామానికి చెందిన రాజిరెడ్డి, రవీందర్ రెడ్డి ఓ వివాహానికి హాజరై వస్తున్నారు. పంబాపూర్‌కు చెందిన సతీశ్ BHPLకి వస్తున్నాడు. ఈ క్రమంలో రాంపూర్ శివారులోన మూల మలుపు వద్ద ఎదురెదురుగా బైకులు ఢీకొన్నాచి. ఇద్దరు అక్కడికక్కడే మృది చెందగా సతీశ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.

Similar News

News February 28, 2026

ప్రతిభ ఆధారంగా విద్యార్థుల ఎంపిక.. మే 13-14న కౌన్సిలింగ్: కలెక్టర్

image

2026-27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ASF కలెక్టర్ కె.హరిత తెలిపారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలకు మార్చి 4 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మార్చి 13-17 మండల, మార్చి 28-ఏప్రిల్ 1 జిల్లా, ఏప్రిల్ 27-మే 1 రాష్ట్ర స్థాయి ఎంపికలు జరుగుతాయి. ఎంపికైన వారికి మే 13,14న కౌన్సిలింగ్ ఉంటుందన్నారు.

News February 28, 2026

ఖమ్మం: అదనపు కలెక్టర్‌కు తీన్మార్ మల్లన్న వినతి

image

భూదాన్ భూముల బాధిత కుటుంబాలకు అదే భూమిలో పునరావాసం కల్పించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని కోరారు. శనివారం తీన్మార్ మల్లన్న అదనపు కలెక్టర్‌ను కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు. తక్షణ సహాయం కింద ప్రతి బాధిత కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించాలని కోరారు. భూదాన్ భూముల విషయంలో పేదలపై మాత్రమే చర్యలు తీసుకోవడం అన్యాయమని లేఖలో ప్రస్తావించారు.

News February 28, 2026

మదీనా బస్సు ప్రమాద బాధితులకు ₹5L చొప్పున పరిహారం

image

TG: గత ఏడాది నవంబర్ 17న సౌదీ అరేబియాలోని మదీనాలో జరిగిన <<18312045>>బస్సు ప్రమాదంలో<<>> 44 మంది HYD వాసులు చనిపోయిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబాలకు CM రేవంత్ ఈరోజు సచివాలయంలో ₹5లక్షల చొప్పున పరిహారం అందజేశారు. గాయపడిన ఒకరికి ₹3లక్షలు ఇచ్చారు. ‘దేశం బయట జరిగే ప్రమాదాలకు ప్రభుత్వాలు పరిహారం చెల్లించవు. కానీ బాధితుల కుటుంబాల పరిస్థితి చూసి సాయం ప్రకటించాం’ అని సీఎం తెలిపారు.