News February 12, 2025

BHPL: పోస్టల్లో ఉద్యోగ అవకాశాలు

image

ఇండియన్ పోస్ట్ 21,413 జీడీఎస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వరంగల్ డివిజన్ పరిధిలో 29 ఖాళీలున్నాయి. దీనికి పదవ తరగతి అర్హులు కాగా.. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. మెరిట్ ఆధారం రిక్రూట్‌మెంట్ చేపడతారు. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్లూఎస్ వారికి రూ.100 కాగా మిగితా వారికి ఉచితం. మార్చి 3 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Similar News

News November 12, 2025

నరసరావుపేట: ఎలుకల నివారణ గోడపత్రికల ఆవిష్కరణ

image

సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమంలో రైతులందరూ భాగస్వాములై తమ పంటలను ఎలుకల బారినుంచి కాపాడుకోవాలని కలెక్టర్ కృత్తికా శుక్లా తెలిపారు. కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖ అధ్వర్యంలో సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమంపై గోడపత్రికలు ఆవిష్కరించారు. జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ ద్వారా అందించిన బ్రోమోడయోలిన్‌ మందును నూనెతో కలిపిన నూకలను తీసుకొని విషపు ఎరను తయారు చేసుకోవాలని చెప్పారు.

News November 12, 2025

చంచల్‌గూడ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ

image

HYDలోని చంచల్‌గూడ జైలులో జాబ్రి, దస్తగిరి అనే రౌడీషీటర్ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ దాడిలో ఇద్దరికీ గాయాలవ్వగా జాబ్రీని సికింద్రాబాద్ గాంధీకి, దస్తగిరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఓ కేసులో రిమాండ్ ఖైదీగా వచ్చిన జాబ్రిను చూడగానే దస్తగిరి దాడికి దిగినట్లుగా తెలుస్తోంది. వీరి గొడవతో ములాఖత్ రూమ్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. వారిద్దరి మధ్య పాత గొడవలు ఉన్నట్లు సమాచారం.

News November 12, 2025

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు: డీఎంహెచ్‌వో

image

లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా, ప్రోత్సహించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో అమృతం హెచ్చరించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చాంబర్‌లో బుధవారం వైద్యాధికారుల కమిటీ సమావేశం జరిగింది. డెకాయ్ ఆపరేషన్లు పటిష్టంగా అమలుపరిచి, స్త్రీ నిష్పత్తిని పెంచేందుకు కృషి చేయాలని ఆయన ఆదేశించారు. జిల్లాలోని 115 స్కానింగ్ సెంటర్‌లలో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని సూచించారు.