News November 3, 2025
BHPL: ప్రకృతి జాతరలో ప్రత్యేక ఆకర్షణగా ఏనుగు బండ్లు!

రెండో తిరుపతిగా ప్రసిద్ధి చెందిన BHPL(D) రేగొండ(M) తిరుమలగిరి శివారు బుగులోని వేంకటేశ్వర స్వామి జాతర ప్రకృతి సౌందర్యాన్ని సంతరించుకుంది. కాగా, ఈ జాతరలో భక్తులు వెంకన్న స్వామి వారికి ఏనుగు, మేక బండ్లతో వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. టపాసులు పేలుస్తూ.. డప్పు చప్పుళ్లతో ఏనుగు బండ్లను కొండకు తీసుకువచ్చే కార్యక్రమం కనులవిందు చేయనుంది. అంతేకాదు, జాతరకు భక్తులు ఎడ్ల బండ్లపై రావడం విశేషం.
Similar News
News November 3, 2025
సంగారెడ్డి: రివాల్వర్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సందీప్ మహబూబ్‌సాగర్ చెరువు కట్టపై రివాల్వర్‌తో కాల్చుకుని సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కల్హేర్‌కు చెందిన సందీప్ ఏడాదికాలంగా పట్టణ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. విషయం తెలుసుకున్న ఎస్పీ పరితోష్ పంకజ్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
News November 3, 2025
చిట్యాల అండర్‌పాస్ వద్ద సమస్య పరిష్కారానికి ఎస్పీ పర్యవేక్షణ

జాతీయ రహదారి 65 పై చిట్యాల రైల్వే బ్రిడ్జి అండర్‌పాస్ వద్ద వర్షపు నీరు నిలిచి తీవ్ర ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన అధికారులకు సూచించారు.
News November 3, 2025
చెత్త పనులు చేయడం వైసీపీకి పరిపాటిగా మారింది: మంత్రి లోకేశ్

AP: డ్రగ్స్ సరఫరా చేస్తున్న YCP స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు కొండారెడ్డిని ఈగల్ టీమ్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుందని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ‘డ్రగ్స్ వద్దని ప్రభుత్వం యుద్ధం చేస్తుంటే YCP పాత వాసనలు వదులుకోవట్లేదు. చెత్త పనులు చేయడం, రాష్ట్రంలో ఏదో అయిపోతుందంటూ హడావుడి చేయడం పరిపాటిగా మారింది. YCP ఫేక్ పార్టీ అని అనేది అందుకే. ఆ పార్టీ నడిపేది స్టూడెంట్ వింగ్ కాదు, డ్రగ్స్ వింగ్’ అని ఆరోపించారు.


