News March 11, 2025
BHPL: మనం ప్రమాదకరమైన గాలిపీలుస్తున్నామా!

కర్బన ఉద్గారాలతో గాలి నాణ్యత తగ్గి, భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడి ప్రజలు ఉక్కరిబిక్కిరి అవుతున్నారు. గాలి నాణ్యత విలువ 0-50 ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 51-100ఉంటే పర్వాలేదని, 101-150 ఉంటే పెద్దలూ, పిల్లల్లో ఊపిరితిత్తులు, వ్యాధులు రావొచ్చని హెచ్చరిస్తున్నారు. 201-300ఉంటే అందరికి వచ్చే ప్రమాదముంది. భూపాలపల్లిలో గాలినాణ్యత విలువ 104గా ఉంది. ఇప్పటికైనా మనం మారాల్సిన అవరముంది. ఏమంటారు!
Similar News
News March 11, 2025
KCRను కలిసిన దాసోజు శ్రవణ్

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దాసోజు శ్రవణ్ మాజీ సీఎం కేసీఆర్‌ను కలిశారు. తనకు MLCగా అవకాశం ఇచ్చినందుకు కుటుంబ సమేతంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. అటు దాసోజుకు కేసీఆర్ అభినందనలు తెలిపారు.
News March 11, 2025
రేపు 1532మందికి ఉద్యోగ నియామక పత్రాలు

TG: జూనియర్ లెక్చరర్(1292మంది), పాలిటెక్నిక్ లెక్చరర్(240మంది) ఉద్యోగాలకు ఎంపికైన వారికి సీఎం రేవంత్ రేపు నియామక పత్రాల్ని అందించనున్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం జరగనుంది. కొత్తగా కొలువుల్లోకి చేరే ఈ సిబ్బందికి విద్యాశాఖ విధానాలు, బోధనాపద్ధతులపై ట్రైనింగ్ అనంతరం పోస్టింగ్స్ ఇస్తామని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తెలిపారు.
News March 11, 2025
ఎలా డైట్ చేస్తే మంచిది?

వెంటనే బరువు తగ్గాలని కొందరు చేస్తున్న డైట్ ప్రాణాలకు ముప్పు తెస్తోంది. తాజాగా కేరళ యువతి <<15712364>>శ్రీనంద<<>> ఇలాగే ఆహారం మానేసి 5నెలల పాటు నీళ్లే తాగి చనిపోయింది. రోజూ మనం తీసుకునే ఫుడ్‌లో 500క్యాలరీల చొప్పున తగ్గిస్తే.. వారానికి 0.5కేజీ, నెలకు 2కిలోలు తగ్గుతామని వైద్యులు చెబుతున్నారు. ఇది ఆరోగ్యవంతమైన డైట్ అని అంటున్నారు. కొందరు 24- 72hrs కేవలం నీళ్లతోనే డైట్ చేస్తారని ఇది ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.