News March 27, 2025

BHPL: సెర్ఫ్ లక్ష్యాల సాధనకు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

సెర్ఫ్ లక్ష్యాల సాధనకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్ తెలిపారు. గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి, సెర్ఫ్ కార్యక్రమాలపై సెర్ఫ్ సీఈఓ దివ్యతో కలిసి జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. ఐకేపీలకు పెండింగ్ కమిషన్ బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని వివరిచారు.

Similar News

News December 24, 2025

హైదరాబాద్‌కు ‘డబుల్’ పవర్?

image

HYD పాలనలో పెను మార్పులకు సర్కార్ స్కెచ్ వేస్తోంది. అడ్మినిస్ట్రేషన్‌ను రెండు భాగాలుగా చీల్చి, పర్యవేక్షణను పక్కాగా చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఓఆర్‌ఆర్‌ లోపల GHMC మొత్తాన్ని స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారికి అప్పగించి, ఆయనే కమిషనర్‌గానూ వ్యవహరించేలా భారీ ప్లాన్ సిద్ధమవుతోంది. ఓఆర్‌ఆర్‌ అవతల శరవేగంగా వెలుస్తున్న మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతలను మరొక ఉన్నతాధికారికి అప్పగించనున్నారు.

News December 24, 2025

సూర్యాపేట కలెక్టర్ సీరియస్.. అధికారి సస్పెండ్

image

కార్యాలయ పని వేళల్లో మద్యం తాగి అసభ్యంగా ప్రవర్తించిన చివ్వెంల పీహెచ్‌సీ సీహెచ్ఓ ఏ.వెంకటేశ్వర్లును జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సస్పెండ్ చేశారు. కార్యాలయ పని వేళల్లో మద్యం తాగడమే కాకుండా, మహిళా ఆరోగ్య కార్యకర్త, మహిళలపై అసభ్యంగా ప్రవర్తించినందుకు గాను తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పి.వెంకటరమణను ఆదేశించారు.

News December 24, 2025

అనకాపల్లి: జిల్లా టీడీపీ పార్లమెంటరీ కమిటీ నియామకం

image

అనకాపల్లి జిల్లా టీడీపీ పార్లమెంటరీ కమిటీని పార్టీ నియమించింది. ఉపాధ్యక్షులుగా కాయల మురళీధర్, తమరాన సింహాద్రి అప్పన్న, ఐ.ఆర్. వీ.రామారావు, జె.రాము, ఏ.అప్పలనాయుడు నియమితులయ్యారు. అదేవిధంగా ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా కే.శ్రీనివాసరావు, జి.కొండతల్లి, ఆర్.మాలతి, యు.దేముడిని.. పార్టీ అధికార ప్రతినిధులుగా బి.శ్రీనివాసరావు, ఎల్.పీ.లోవరాజు, ఎస్.మణి, కోశాధికారిగా జి.శాంతమ్మను నియమించారు.