News March 7, 2025
BHPL: 20 ఏళ్ల నుంచి చోరీలు.. 36 కేసులు నమోదు

2005 నుంచి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిపై పలు జిల్లాల్లో 36 కేసులు నమోదయ్యాయని ఏసీపీ కృష్ణ తెలిపారు. ఏసీపీ వివరాలిలా.. భూపాలపల్లి(D) మల్హర్‌రావు(M) రెడ్డిపల్లెకు చెందిన బోరిగం సంపత్ జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్నాడు. ఇటీవల పెద్దపల్లి(D) కాల్వ శ్రీరాంపూర్(M) చిన్నరాతులపల్లిలో శాంతమ్మ ఇంట్లో బంగారం అపహరించాడు. విచారణ జరిపి అతని వద్ద నుంచి రూ.15.47 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News November 7, 2025
HYD: వారంలో కూతురి పెళ్లి.. ఇంతలోనే విషాదం..!

జనగామ(D) బచ్చన్నపేట(M) ఆలీంపూర్‌లో రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYD ECILలోని ఆర్టీవన్ కాలనీ వాసి బండి శ్రీనివాస్(50) తన కూతురిని సిద్దిపేట(D) కొండపాక(M) వెలికట్టెకు చెందిన ఓయువకుడికి ఇచ్చి ఈనెల 13న పెళ్లి చేయాల్సి ఉంది. ఈ క్రమంలో చేర్యాల(M) ముస్త్యాలలో బంధువులకు పెళ్లి పత్రిక ఇచ్చేందుకు వెళ్తుండగా బైక్, DCM ఎదురెదురుగా ఢీకొనగా శ్రీనివాస్ మరణించాడు.

గుంటూరులో గంజాయి ముఠా అరెస్ట్

గుంటూరులో గంజాయి సేవించడంతో పాటు విక్రయిస్తున్న మైనర్‌తో సహా ఏడుగురు యువకులను నగరంపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ₹30 వేల నగదు, 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జెడ్పీ వద్ద ఖాళీ స్థలంలో గంజాయి కలిగి ఉన్నట్లు సమాచారం అందడంతో ఈ అరెస్టులు చేసినట్లు డీఎస్పీ అరవింద్ తెలిపారు.