News March 22, 2025

BHPL: అటవీ భూముల కేటాయింపుపై సమీక్ష

image

 చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన అటవీ భూముల కేటాయింపుపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శనివారం ఐడీఓసీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అటవీ, రెవెన్యూ, సర్వే, ఆర్అండ్‌‌బీ, మెగా ప్రాజెక్టు అధికారులకు అవసరమైన భూముల కేటాయింపునకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News March 25, 2025

దిలావర్పూర్‌ ఆందోళనకారులపై కేసులు ఎత్తి వేసేనా…?

image

గతేడాది దిలావర్పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. 130రోజుల నిరసనల తర్వాత ప్రభుత్వం వెనక్కితగ్గింది. ఆందోళనకారులపై పెట్టిన కేసులను అధికారంలోకొస్తే తొలగిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. తమపై కేసులు తొలగించాలని మహిళలు ఎదురుచూస్తున్నారని నిర్మల్ MLA మహేశ్వర్‌రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.

News March 25, 2025

పల్నాడు: విడదల రజనిని అరెస్ట్ చేస్తారా..?

image

చిలకలూరిపేటకు చెందిన మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడుదల రజని అరెస్టు కానున్నారా? అనే విషయంపై పొలిటికల్ సర్కిల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రూ.2 కోట్ల నగదు అక్రమంగా వసూలు చేసినట్లు ఇప్పటికే ఆమెపై కేసు నమోదు అయింది. ఎంపీ కృష్ణదేవరాయలు, ప్రత్తిపాటి పుల్లారావు, మర్రి రాజశేఖర్ వంటి కీలక నేతలు ఆమెపై వరుస పెట్టి ఆరోపణలు చేస్తుండటం ఈ వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.

News March 25, 2025

తిరుపతి: సైలెంట్ మోడ్‌లో వైసీపీ నేతలు.?

image

తిరుపతి(D)లో YCP నేతల పరిస్థితి కొంచెం ఇష్టం-కొంచెంకష్టం అన్నట్లు మారింది. భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి, రోజా, మోహిత్ రెడ్డి మినహా మిగిలిన వారు పార్టీ కార్యకలాపాలకు అంటీముట్టనట్లు ఉన్నారని సమాచారం. బియ్యపు మధుసూదన్ రెడ్డి, చెవిరెడ్డి, సత్యవేడు ఇన్‌ఛార్జ్ రాజేశ్ వంటి నేతలు నియోజకవర్గంలో పెద్దగా కనబడటం లేదని టాక్. చెవిరెడ్డి సైతం మునుపటి స్థాయిలో చురుగ్గా లేరని చర్చ జరుగుతోంది.

error: Content is protected !!