News January 11, 2025

ఫిబ్రవరి 15 నుంచి 28లోపు అమల్లోకి భూ భారతి చట్టం: మంత్రి

image

TG: భూ భారతి చట్టం కోసం చాలా కష్టపడ్డామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 15 నుంచి 28వ తేదీ లోపు ఈ చట్టం పూర్తిగా అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా దీనిని అమలు చేస్తామని చెప్పారు. ధరణి ద్వారా ఆక్రమించిన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని, ధరణిని వాడుకుని తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

Similar News

News December 6, 2025

సేంద్రియ ఎరువులు.. సాగులో వాటి ప్రాధాన్యత

image

పంటలు, మొక్కలు ఏపుగా పెరగాలంటే ఎరువులు అవసరం. ఇవి మొక్కలకు కావాల్సిన పోషకాలను అందించి మంచి దిగుబడిని అందిస్తాయి. రసాయన ఎరువులతో కొన్ని దుష్పరిణామాలు ఉన్నందున ప్రస్తుతం చాలా మంది రైతులు సేంద్రియ ఎరువులను వాడుతున్నారు. ఈ ఎరువులను మొక్కలు, జంతువుల వ్యర్థాలు, విసర్జితాల నుంచి తయారుచేస్తారు. సమగ్ర ఎరువుల వాడకంలో సేంద్రియ ఎరువులు ఒక భాగం. రైతులు వీటిని వ్యవసాయంలో తప్పక వాడితే సాగు వ్యయం తగ్గుతుంది.

News December 6, 2025

ESIలో చేరడానికి ఈ నెల 31 చివరి తేదీ

image

ESIC తీసుకొచ్చిన SPREEలో కంపెనీల యజమానులు, ఉద్యోగులు చేరడానికి ఈ నెల 31 చివరి తేదీ. దీనివల్ల ఇరువురికీ కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలన్నీ అందుతాయి. 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగిన యజమానులు www.esic.gov.inలో నమోదు చేసుకోవచ్చు. యజమాని ప్రకటించిన రోజు నుంచే రిజిస్ట్రేషన్ చెల్లుతుంది. మునుపటి రోజులకు తనిఖీ ఉండదు. జీతం నెలకు రూ.21వేల కంటే తక్కువ ఉన్న ఉద్యోగులు అర్హులు.

News December 6, 2025

స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసా?

image

సాధారణంగా గర్భాశయంలో ఏర్పడే గర్భం కాకుండా, గతంలో సిజేరియన్‌ చేసిన కుట్టు వద్ద ఏర్పడటాన్ని స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇది సుమారు రెండువేల మందిలో ఒకరికి మాత్రమే వస్తుందంటున్నారు నిపుణులు. ఈ గర్భం కొనసాగితే తీవ్రమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో గర్భాశయపు కుట్టు తెరుచుకోవడం, గర్భాశయం చీలిపోవడం వంటివి జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.