News April 13, 2025
సామాన్యుడికి సులువుగా అర్థమయ్యేలా ‘భూభారతి’: పొంగులేటి

TG: రేపటి నుంచి అమల్లోకి తీసుకురానున్న భూభారతి పోర్టల్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకేసారి రాష్ట్రమంతటా పోర్టల్‌ను లాంచ్ చేస్తే తప్పులు సరిచేయడం ఇబ్బందవుతుందన్నారు. అందుకే పైలట్ ప్రాజెక్టుగా తొలుత మూడు మండలాల్లో అమలు చేస్తామన్నారు. సామాన్యుడికి సైతం సులువుగా అర్థమయ్యేలా పోర్టల్ ఉంటుందని స్పష్టం చేశారు. ‘ధరణి’తో గత ప్రభుత్వం చేసిన అక్రమాలను బయటపెడతామన్నారు.
Similar News
News September 15, 2025
BREAKING: కాలేజీలతో చర్చలు సఫలం

TG: కాలేజీల యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో రేపటి నుంచి కాలేజీలు యథావిధిగా నడవనున్నాయి. ప్రస్తుతం రూ.600కోట్ల బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీపావళికి మరో రూ.600కోట్లు రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు బంద్‌ను విరమించుకున్నాయి.
News September 15, 2025
ప్రియుడితో కలిసి భర్త చెవులు కోసేసిన భార్య

TG: ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్త చెవులు కోసేసిన ఘటన మహబూబాబాద్(D)లో జరిగింది. మహబూబాబాద్ మండలం గడ్డిగూడెం తండాకు చెందిన మహిళకు గంగారం(M) మర్రిగూడేనికి చెందిన అనిల్‌తో వివాహేతర సంబంధం ఉంది. ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు ప్లాన్ చేసింది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి అతడి చెవులు కోసేయగా ప్రాణ భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశాడు. అనంతరం పారిపోయేందుకు యత్నించిన ప్రియుడిని స్థానికులు పట్టుకొని చితకబాదారు.
News September 15, 2025
రాష్ట్రానికి అదనంగా 40వేల MT యూరియా

TG: రాష్ట్రానికి మరో 40వేల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఈ వారంలో రాష్ట్రానికి 80వేల MT సరఫరా కానుంది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం సాగులో ఉన్న వరి, మొక్కజొన్న, పత్తికి యూరియా ఎంతో అవసరం. ఈ పంటలకు రానున్న 15 రోజులు చాలా కీలకం. అందుకే రైతుల అవసరాలకు తగ్గట్టుగా యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని <<17720342>>కోరాం<<>>’ అని వెల్లడించారు.