News April 12, 2025
ఎల్లుండి నుంచి ‘భూ భారతి’ అమలు

TG: భూ భారతి చట్టాన్ని ఈనెల 14 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో ఎంపిక చేసిన 3 మండలాల్లో అమల్లోకి తేనుంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. భూ భారతి పోర్టల్‌ను మరింత బలోపేతం చేస్తామన్నారు. ఈ పోర్టల్‌పై ప్రతి మండలంలో కలెక్టర్ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News April 13, 2025
ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధిపై ప్రణాళికకు CM ఆదేశం

AP: ఒంటిమిట్టను ఆధ్యాత్మిక గమ్యస్థానంగా మార్చేందుకు బృహత్తర ప్రణాళిక రూపొందించాలని CM చంద్రబాబు ఆదేశించినట్లు TTD ఛైర్మన్ BR నాయుడు తెలిపారు. పెరుగుతున్న యాత్రికుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలను సిద్ధం చేయాలని సమీక్షలో చెప్పారన్నారు. ఒంటిమిట్ట చెరువును సుందరీకరించి బోటింగ్ సౌకర్యం కల్పించాలని సూచించారని వివరించారు. అలాగే, నిత్యాన్నదానం కోసం భవనం నిర్మించాలని ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.
News April 13, 2025
ఇందిరమ్మ ఇళ్లపై సీఎం కీలక సూచనలు

TG: ఇందిరమ్మ ఇళ్లను మొదటి దశలో అత్యంత నిరుపేదలకు, అర్హులకు మాత్రమే కేటాయించాలని CM రేవంత్ స్పష్టం చేశారు. ఈ పథకం పారదర్శకంగా, నిరుపేదలకు న్యాయం చేసేలా అమలు కావాలని ఉన్నతస్థాయి సమావేశంలో సూచించారు. లబ్ధిదారుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలు జాగ్రత్తగా పని చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సిమెంట్, స్టీల్ తదితర సామగ్రిని సరసమైన ధరలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
News April 13, 2025
ఇల్లు కొనాలనే తొందరలో తప్పులొద్దు!

సొంతిల్లు కొనాలనే తొందరలో కొందరు చేసే చిన్న తప్పులే మున్ముందు చాలా ఇబ్బందులు తెస్తాయి. ముందుగా అసలు ఇల్లు ఎందుకు కొనాలని అనుకుంటున్నామో స్పష్టత ఉండాలి. ఏ ప్రాంతంలో కొంటున్నాం? అక్కడ వృద్ధి ఎలా ఉంటుంది? అద్దెకు ఇస్తే ఆదాయం ఎంతొస్తుంది? ముందుగా అనుకున్న దాని కంటే ఎక్కువ మొత్తాన్ని వెచ్చిస్తున్నామా? తదితర ప్రశ్నలు వేసుకోకపోతే భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికలు దెబ్బతింటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.