News April 13, 2025

భూ భారతి వెబ్‌సైట్‌ పారదర్శకంగా ఉండాలి: CM రేవంత్

image

TG: భూ భారతి వెబ్‌సైట్‌ను సామాన్య రైతులకు కూడా సులభంగా అర్థమయ్యేలా రూపొందించాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. జూబ్లీహిల్స్‌ నివాసంలో దీనిపై సమీక్షించారు. 100 ఏళ్లపాటు నడిచే ఈ వెబ్‌సైట్‌ అత్యాధునికంగా, పారదర్శకంగా ఉండాలన్నారు. భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా రూపొందించాలని.. భద్రత కోసం ఫైర్‌వాల్స్ ఏర్పాటు చేసి, నిర్వహణను విశ్వసనీయ సంస్థకు అప్పగించాలని ఆదేశించారు.

Similar News

News April 15, 2025

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు బిగ్ షాక్?

image

TG: ఇంజినీరింగ్ విద్యార్థులకు బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు ఫీజులు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫీజులపై అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఫీజులపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా 52% నుంచి 84% ఫీజులు పెంచాలని ప్రభుత్వంపై కాలేజీలు ఒత్తిడి తెస్తున్నాయి.

News April 15, 2025

కారు డోర్ లాకింగ్ మర్చిపోకండి!

image

TG: మీరు ఏ పనిలో ఉన్నా పిల్లల్ని ఓ కంట గమనిస్తూనే ఉండాలనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిన్న తన్మయశ్రీ(5), అభినయశ్రీ(4) కారులో ఊపిరాడక చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మేనమామకు పెళ్లి కుదిరిందని వెళ్లిన పిల్లలు కారులో ఆడుకోవడానికి వెళ్లి డోర్ లాక్ చేసుకున్నారు. కాబట్టి ఎప్పుడూ కారును లాక్ చేసి ఉంచండి. ముఖ్యంగా చిన్న పిల్లలున్న పేరెంట్స్ ఇది మర్చిపోవద్దు.

News April 15, 2025

TCSలో 42వేల మంది ప్రెషర్లకు ఉద్యోగాలు!

image

ఈ ఆర్థిక సంవత్సరంలో 42వేల మంది ప్రెషర్లకు ఉద్యోగాలు ఇవ్వాలని టీసీఎస్ నిర్ణయించినట్లు సమాచారం. 2024-25 మాదిరిగానే రిక్రూట్‌మెంట్ ఉంటుందని తెలుస్తోంది. నేషనల్ క్వాలిఫయర్ టెస్టులో ప్రతిభ చూపిన వారిని ప్రైమ్, డిజిటల్, నింజా విభాగాల్లో నియమించుకోనుంది. కాగా FY2024-25 చివరికి 6,07,979 మంది ఉద్యోగులు TCSలో ఉన్నారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 6,433 మంది మాత్రమే పెరిగారు.

error: Content is protected !!