News March 20, 2024

నేటి నుంచి భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర

image

AP: నేటి నుంచి చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర చేపట్టనున్నారు. 20, 21, 22 తేదీల్లో కడప, అన్నమయ్య జిల్లాలో ఆమె పర్యటించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో మనోవేదనకు గురై చనిపోయిన వారి కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. వారికి రూ.3 లక్షల పరిహారం కూడా చెల్లించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ సిద్ధం చేస్తోంది.

Similar News

News October 23, 2025

రెడ్ అలర్ట్.. ఫ్లాష్ ఫ్లడ్స్‌కు అవకాశం

image

AP: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలో అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కోస్తాంధ్ర, యానాంతో పాటు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ (ఆకస్మిక వరదలు) వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు ఈ నెల 25-28 మధ్యలో మరో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉంది.

News October 23, 2025

తెలంగాణ రౌండప్

image

* రేపు ఫిరాయింపు MLAలను విచారించనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్..
* రంగారెడ్డి, వికారాబాద్, HNK, మేడ్చల్‌లో డీఅడిక్షన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు..
* వచ్చే నెల 20 నుంచి రాష్ట్రంలో పులుల లెక్కింపు.. నేటి నుంచి జిల్లాకు ఇద్దరు అధికారుల చొప్పున శిక్షణ
* రంగారెడ్డిలోని కుర్మల్ గూడ, తొర్రూర్, మేడ్చల్‌లోని బహదూర్‌ పల్లి రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లకు ఈ నెల 28 నుంచి 30వరకు ఈ-వేలం

News October 23, 2025

అకాలపు వాన.. అరికల కూడు

image

ఇప్పుడు మనకు సాధారణంగా కనిపించే వరి అన్నం ఒకప్పుడు చాలా అరుదు. కేవలం ధనికుల ఇళ్లలోనే వండుకునేవారు. సామాన్యులు ఎక్కువగా అరికల అన్నం తినేవారు. కొత్తగా వరి పండించే రోజుల్లో ‘అకాలపు వాన.. అరికల కూడు’ అనే సామెత ప్రాబల్యంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. వాన అదును తప్పి కురిస్తే ధనవంతులు కూడా అరికల కూడు తినాల్సిందేనన్నది దీని అర్థం.
☛ మీకు తెలిసిన వ్యవసాయ సామెతలను కామెంట్ చేయండి