News August 19, 2024
భుజంగరావుకు బెయిల్ మంజూరు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనకు చికిత్స కోసం 15 రోజులు బెయిల్ ఇస్తున్నట్లు కోర్టు తెలిపింది. హైదరాబాద్ విడిచి వెళ్లవద్దని న్యాయస్థానం ఆయనను ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు A2గా ఉన్నారు.
Similar News
News January 23, 2026
కరాచీ ప్రమాదంలో 67కు చేరిన మృతుల సంఖ్య

పాకిస్థాన్ కరాచీలోని ‘గుల్ షాపింగ్ ప్లాజా’లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 67కు చేరింది. శిథిలాల నుంచి పదుల సంఖ్యలో మృతదేహాలను వెలికితీశారు. దుబాయ్ క్రాకరీ అనే షాప్లో ఒకేచోట 30 మృతదేహాలు లభ్యమయ్యాయి. మంటల నుంచి తప్పించుకోవడానికి షాప్ లోపల దాక్కోగా.. ఊపిరి ఆడక చనిపోయారని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు మృతుల్లో 12 మందిని మాత్రమే గుర్తించారు.
News January 23, 2026
MEGA 158లో చిరు సరసన ప్రియమణి!

చిరంజీవి ప్రస్తుతం ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు బాబీ డైరెక్షన్లో రాబోతున్న ‘మెగా 158’ మూవీ స్క్రిప్ట్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ మూవీలో చిరంజీవి భార్య పాత్రలో ప్రియమణి కనిపించబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే కుమార్తె పాత్రలో హీరోయిన్ కృతిశెట్టి నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News January 23, 2026
బందీలుగా ఉన్న మత్స్యకారులకు ఈనెల 29న విముక్తి

AP: బంగ్లాదేశ్ జైల్లో బందీలుగా ఉన్న 23 మంది భారతీయ మత్స్యకారులు ఈ నెల 29న విడుదల కానున్నారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ అధికారికంగా ప్రకటించింది. విడుదలయ్యే వారిలో విజయనగరం జిల్లాకు చెందిన 9 మంది, పశ్చిమ బెంగాల్కు చెందిన 14 మంది ఉన్నారు. గత అక్టోబర్ 22న విశాఖ హార్బర్ నుంచి వేటకు వెళ్లి పొరపాటున బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించడంతో వీరు అరెస్టయ్యారు.


