News June 4, 2024
TTD ఛైర్మన్ పదవికి భూమన రాజీనామా

AP: వైసీపీ ఘోర ఓటమితో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు టీటీడీ ఈవోకు ఆయన రాజీనామా లేఖ రాశారు. వెంటనే తన రిజైన్ ఆమోదించాలని కోరారు. తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన కుమారుడు భూమన అభినయ్ ఓటమి దిశగా సాగుతున్నారు.
Similar News
News January 27, 2026
ఇండియన్ మార్కెట్లోకి ‘డస్టర్’ రీఎంట్రీ

ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ తన ‘డస్టర్’ కారును మరోసారి మార్కెట్లోకి తీసుకొచ్చింది. రిపబ్లిక్ డే సందర్భంగా బుకింగ్స్ ఓపెన్ చేసింది. ఒకప్పుడు పాపులరైన ఈ కార్ల ఉత్పత్తి 2022లో నిలిచిపోయింది. అయితే చెన్నైలోని తయారీ ప్లాంట్ను పూర్తిగా సొంతం చేసుకున్న కంపెనీ డస్టర్తో రీఎంట్రీ ఇచ్చింది. దీంతో టాటా సియెర్రా, హ్యుందాయ్ క్రెటా, మారుతీ గ్రాండ్ విటారా, కియా సెల్టోస్తో డస్టర్ పోటీ పడనుంది.
News January 27, 2026
USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి

అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. అనేక నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో లక్షల మంది అంధకారంలో ఉన్నారు. పలు ఘటనల్లో 29 మంది మరణించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 15కుపైగా రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొనగా రవాణా స్తంభించిపోయింది. మంచు తుఫాన్ ప్రభావంతో సుమారు 17వేలకుపైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. పరిస్థితులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
News January 27, 2026
ఫైబర్ ఎందుకు తీసుకోవాలంటే..

మనల్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాల్లో ఫైబర్ ఒకటి. ఇందులో సాల్యుబుల్ ఫైబర్, ఇన్ సాల్యుబుల్ ఫైబర్ అనే రకాలుంటాయి. దీనివల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగయ్యి గ్యాస్, అసిడిటీ, ఉబ్బరం, మలబద్దకం తగ్గుతాయి. కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ నియంత్రణలో ఉంటాయి. పురుషులకు రోజుకు 30 గ్రా, స్త్రీలకు 25 గ్రా ఫైబర్ అవసరం. 2-5 ఏళ్ల పిల్లలకు 15 గ్రా, 5-11 ఏళ్లు పిల్లలకు 20 గ్రా వరకు రోజూ ఫైబర్ కావాలి.


