News August 26, 2025
భూమన తీవ్ర ఆరోపణలు.. ఆ IAS ఎవరు?

AP: వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఓ సీనియర్ IAS అధికారిణిపై చేసిన <<17523215>>కామెంట్స్<<>> చర్చనీయాంశంగా మారాయి. ఆమె అవినీతిలో అనకొండలాంటిదని, TDR బాండ్ల ద్వారా రూ.వందల కోట్లు దోచుకోవాలని ప్రయత్నించిందని ఆరోపించారు. రోజూ ధరించే చీర రూ.లక్షన్నర అని, రూ.50 లక్షల కంటే విలువైన విగ్గులు ఆమెకు 11 ఉన్నాయని వ్యక్తిగతంగానూ విమర్శించారు. రోజుకో విగ్గుతో దర్శనమిస్తారన్నారు. అయితే ఆ అధికారిణి పేరు మాత్రం వెల్లడించలేదు.
Similar News
News August 27, 2025
ఆగస్టు 27: చరిత్రలో ఈ రోజు

1908: ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ డోనాల్డ్ బ్రాడ్‌మాన్ జననం(ఫొటోలో)
1957: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ జననం.
1963: నటి సుమలత జననం.
1972: రెజ్లర్ గ్రేట్ ఖలీ జననం.
2010: తెలుగు వైద్యుడు కంభంపాటి స్వయంప్రకాష్ మరణం
News August 27, 2025
నెలాఖరున రోహిత్, రాహుల్‌కు యోయో టెస్ట్?

ఈ నెల 30-31 తేదీల్లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌కు అగ్ని పరీక్ష ఎదురుకానుంది. ఆ రోజుల్లో వారు యోయో టెస్ట్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. దీంతో ఈ టెస్టును క్లియర్ చేసేందుకు ఇద్దరూ తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సమాచారం. కాగా ఆటగాళ్ల ఫిట్‌నెస్ కోసం బీసీసీఐ యో యో టెస్ట్ నిర్వహిస్తోంది. ఆటగాళ్లను మరింత ఫిట్, స్ట్రాంగ్‌గా ఉంచేందుకు ఈ టెస్ట్ ఉపయోగపడుతుందని బోర్డు విశ్వసిస్తోంది.
News August 27, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.