News August 28, 2024

నేడు తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజ

image

TG: నేడు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరగనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటనలో తెలిపారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. డిసెంబర్ 9న ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

Similar News

News February 22, 2026

హోం క్లీనింగ్ టిప్స్

image

* కత్తెర మొద్దుబారినప్పుడు అల్యూమినియం ఫాయిల్ ను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరిస్తే పదునెక్కుతుంది. * మొక్కజొన్న పిండికి కొంచెం నీళ్ళు కలిపి పేస్టు చేసుకొని అద్దాలకు పట్టించి పొడి వస్త్రంతో తుడవాలి. * కంప్యూటర్ కీ బోర్డు, మౌస్ పై మరకలు పడితే వెనిగర్‌లో ముంచిన వస్త్రంతో శుభ్రం చేయాలి. దీనివల్ల సూక్ష్మక్రిములూ నశిస్తాయి. * వెండి వస్తువులను సహజ సిద్ధ గోరింటాకులో నానబెట్టి శుభ్రపరిస్తే తళతళలాడతాయి.

News February 22, 2026

సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

image

చెన్నైలోని CSIR-సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ 3 ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి M.Tech(ఫుట్‌వేర్ Engg.&మేనేజ్‌మెంట్, MSc (బయోటెక్నాలజీ/బయోసైన్స్/బయోకెమిస్ట్రీ) అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 16న రాత పరీక్ష, 18న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. NET/GATE అర్హత కలిగినవారు రాత పరీక్షకు హాజరుకానవసరం లేదు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. వెబ్‌సైట్: clri.org/

News February 22, 2026

11 సార్లు రామాయణాన్ని వీక్షించిన మహర్షి

image

కాకి ముఖం, మానవ శరీరంతో ఉండే కాగ్భుషుండి మహర్షి రామాయణాన్ని 11 సార్లు, భారతాన్ని 16 సార్లు వీక్షించారని పురాణాల వాక్కు. లోమశ మహర్షి శాపంతో ఈ రూపం పొందారట. రాముడిపై భక్తితో చిరంజీవిగా నిలిచారని చెబుతారు. జ్ఞాన సముపార్జనలో రూపం ముఖ్యం కాదని, అహంకారాన్ని వీడి రామనామాన్ని జపించడమే పరమార్థమని ఆయన వశిష్ఠ మహర్షికే బోధించారు. గరుత్మంతుడి సందేహాలను నివృత్తి చేస్తూ రామాయణ రహస్యాలను వివరించిన జ్ఞాని ఈయన.